Teenager Raped: టీనేజ్ బాలికపై రేప్.. నిందితుడికి సహకరించిన భార్య.. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి..

Wife helps Husband to Rape Teenage Girl: ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ జిల్లాలో ఓ టీనేజ్ బాలికపై ఓ వ్యక్తి అత్యాచారానికి పాల్పడ్డాడు. బాలికపై అత్యాచారానికి అతని భార్య కూడా సహకరించింది.

Written by - Srinivas Mittapalli | Last Updated : Jul 16, 2022, 11:52 AM IST
  • ఉత్తరప్రదేశ్‌లో దారుణం
  • టీనేజ్ బాలికపై దంపతుల అఘాయిత్యం
  • బాలికపై రేప్ చేసిన వ్యక్తికి భార్య సహకారం
Teenager Raped: టీనేజ్ బాలికపై రేప్.. నిందితుడికి సహకరించిన భార్య.. సెల్‌ఫోన్‌లో వీడియో తీసి..

Wife helps Husband to Rape Teenage Girl: ఉత్తరప్రదేశ్‌లో దారుణం వెలుగుచూసింది. భార్యాభర్తలు కలిసి ఓ టీనేజీ యువతిపై అఘాయిత్యానికి పాల్పడ్డారు. భర్త యువతిపై అత్యాచారం జరపగా.. భార్య అందుకు సహకరించింది. ఆ తతంగాన్ని సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించింది. ఆపై ఆ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేశారు. బదౌన్ జిల్లా ఫైజ్ గంజ్ బెహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ ఘటన జరిగింది. బాధిత బాలిక ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఫైజ్ గంజ్ బెహ్తా పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ గ్రామంలో కుటుంబ సభ్యులతో కలిసి ఆ బాలిక నివసిస్తోంది. మంగళవారం (జూలై 12) ఆ బాలికను అదే గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తమ ఇంటికి రమ్మని పిలిచాడు. బాలిక అతని ఇంటికి వెళ్లగా.. అక్కడ ఆమెపై అత్యాచారం జరిపాడు. ఇందుకు అతని భార్య సహకరించడమే కాక.. సెల్‌ఫోన్‌లో వీడియో చిత్రీకరించింది.

ఈ విషయం బయటకు పొక్కితే రేప్ వీడియోను సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేస్తామని ఆ దంపతులు బాలికను బెదిరించారు. ఈ ఘటన జరిగిన ఒకటి, రెండు రోజులకు బాలిక రేప్ వీడియో సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఆమెను వెంటపెట్టుకుని వెళ్లి సదరు దంపతులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు ఆ ఇద్దరిపై రేప్, పోక్సో చట్టాల కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు. ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతోంది.  
Also Read: Horoscope Today July 16th: నేటి రాశి ఫలాలు.. అవివాహితులైన ఈ రాశి వారికి మంచి పెళ్లి సంబంధం కుదిరే ఛాన్స్..

Also Read: Vaani Kapoor Pics: ఉల్లిపొర లాంటి డ్రెస్‌లో.. అందాల ట్రీట్ ఇచ్చిన వాణీ క‌పూర్!

 

స్థానిక నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

Trending News