సిద్ధరామయ్య వివాదంపై స్పందించిన బాధిత మహిళ

సిద్ధరామయ్య వివాదంపై స్పందించిన బాధిత మహిళ

Last Updated : Jan 29, 2019, 12:13 PM IST
సిద్ధరామయ్య వివాదంపై స్పందించిన బాధిత మహిళ

మైసూరు: కర్ణాటకలోని మైసూరు జిల్లా వరుణ నియోజకవర్గంలో సోమవారం జరిగిన ఓ బహిరంగ సభకు హాజరైన కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య.. అక్కడ తనను నిలదీసి ప్రశ్నించిన ఓ మహిళపై అనుచితంగా ప్రవర్తించడం సంచలనం రేపింది. రాజకీయవర్గాల్లో తీవ్ర చర్చనియాంశంగా మారిన ఈ ఘటనపై సదరు మహిళను మీడియా వివరణ కోరింది. అసలు ఏం జరిగింది ? మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు ఎందుకు ఆమెపై అంత కోపం కట్టలు తెంచుకుందనే వివరాలు నేరుగా ఆమె నుంచే రాబట్టే ప్రయత్నం చేసింది అక్కడున్న మీడియా.

ఈ ఘటన అనంతరం సభ బయట మీడియాతో మాట్లాడిన జమల అనే సదరు మహిళ.. తనకు మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్యతో ఎటువంటి విభేదాలు లేవని అన్నారు. సిద్ధరామయ్య గారు ఉత్తమమైన ముఖ్యమంత్రే. అందులో ఏ సందేహం లేదు. అయితే, తానే ఫిర్యాదులపై స్పందించాల్సిందిగా కోరుతూ కాస్త కటువుగా మాట్లాడాను. ఒక మాజీ ముఖ్యమంత్రితో అంత కటువుగా మాట్లాడి వుండాల్సింది కాదు. తాను బల్ల గుద్ది మరీ మాట్లాడేసరికి సిద్ధరామయ్య గారికి కోపం వచ్చింది అని ఆ  మహిళ మీడియాకు వివరణ ఇచ్చారు.

Trending News