Improvement in the ease of travel for vaccinated Indians: హైదరాబాద్‌కు చెందిన భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన కరోనా టీకాకు (Covaxin) ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఈ నెల 3న ఆమోద ముద్ర వేసింది. ఈ నిర్ణయంతో భారతీయుల విదేశీ ప్రయాణాలు మరింత సులభతరం కానున్నాయని విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ (Ministry of External Affairs on Covaxin) తెలిపింది.
ప్రస్తుతం 96కుపైపగా దేశాలు.. డబ్ల్యూహెఓ గుర్తించిన కొవిడ్ వ్యాక్సిన్‌ను తీసుకున్న విదేశీ ప్రయాణికులను తమ దేశంలోకి అనుమతిస్తున్నాయి. ఈ జాబితాలో ఉన్న దేశాలన్ని ఇప్పుడు కొవాగ్జిన్ వేసుకున్న వారిని తమ దేశంలోకి అనుమతించడం లాంఛనమే (Covaxin Travel) కానుందని పేర్కొంది.
అయితే కొన్ని దేశాలు మాత్రం వ్యాక్సిన్‌కు సంబంధించి విడిగా అనుమతులు ఇస్తోంది. అలాంటి దేశాలతో తామే స్వయంగా సంప్రదింపులు జరపుతున్నామని పేర్కొంది. కొవాగ్జిన్‌కు గుర్తింపునిస్తూ.. ప్రత్యేక మార్గదర్శకాలను జారీ చేసినట్లు విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి అరిందమ్ బాగ్చి గురువారం మీడియాకు వెల్లడించారు.
Also read: Kangana Ranaut: 'దేశానికి స్వాతంత్ర్యం 2014లో వచ్చింది' కంగనా వివాదాస్పద వ్యాఖ్యలు
ఇక వ్యాక్సిన్ ఎగుమతి గురించి ప్రశ్నించగా.. ముందు దేశీయ అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఆ తర్వాతే ఎగుమతుల చేస్తామని సమాధానమిచ్చారు బాగ్చి.
Also read: Man kiled by wife's boyfriend : ఇష్టం లేని పెళ్లి చేశారని ప్రియుడితో భర్తను చంపింది
Also read: Forced marriage : ప్రేమికులను బంధించి పెళ్లి చేసి అసభ్యకరంగా ప్రవర్తించిన యువకులు
కొవిడ్ లక్షణాలున్న వారిలో 77.8 శాతం రక్షణ..
కొవాగ్జిన్‌కు డబ్ల్యూహెచ్ఓ అనుమతులు లభించిన వారం తర్వాత ప్రముఖ మెడికల్ జర్నల్ లానెస్ట్ కీలక విషయాలు (Lancet on Covaxin) వెల్లడించింది. కొవిడ్ లక్షణాలు ఉన్నవారిలో 77.8 శాతం, కరోనా(Corona virus) లక్షణాలు లేని వారిలో 63.6 శాతం మేర సమర్థంగా (Covaxin efficiency) కొవాగ్జిన్ పని చేస్తున్నట్లు తేలిందని లాన్సెట్ తెలిపింది.
24 మంది వ్యాక్సిన్ తీసుకున్నవారు, 106 మంది ఇతరులు సహా మొత్తం 130 మందిపై నిర్వహించిన ప్రయోగాల్లో ఈ విషయం వెల్లడైనట్లు పేర్కొంది లాన్సెట్. డెల్టా వేరియంట్‌పై 65.2 శాతం, ఇతర అన్ని రకాల కొవిడ్ స్ట్రెయిన్ల నుంచి 70.8 శాతం రక్షణ కల్పిస్తుందని స్పష్టం చేసింది.
లాన్సెట్ నివేదిక అనంతరం.. భారత్ బయోటెక్ కొవాగ్జిన్ సామర్థ్యంపై మరోసారి ప్రకటన చేసింది. తీవ్రమైన కొవిడ్ లక్షణాలు ఉన్న వారిపై 93.4 శాతం సమర్థంగా తమ వ్యాక్సిన్ పని చేస్తున్నట్లు వివరించింది. మూడో దశ క్లీనికల్ ట్రయల్ డేటాను విశ్లేషించి ఈ మేరకు నివేదికను రూపొందించింది.
Also read: Xi Jinping Tighten His Grip: చైనా అధ్యక్షుడిగా మరోసారి జిన్ పింగ్కే పగ్గాలు!
Also read: Imran Khan: ఉగ్రవాదులతో చర్చలా అంటూ.. ఇమ్రాన్ ఖాన్‌పై పాకిస్థాన్ సుప్రీం కోర్టు ఆగ్రహం!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebook మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి