న్యూఢిల్లీ: ఆర్బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ రాజీనామా చేయడం ఓ సంచలనమైతే.. ఇప్పుడు ఆయన స్థానంలో ఎవరు రానున్నారనేది మరో ఆసక్తికరమైన అంశంగా మారింది. ఇదే అంశం చర్చకొచ్చినప్పుడు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ రేసులో ఇద్దరి పేర్లు ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అందులో ఒకరు ఆర్థిక వ్యవహారాల శాఖ మాజీ కార్యదర్శి శక్తికాంత దాస్ కాగా మరొకరు ప్రస్తుతం ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా వున్న ఎన్.ఎస్. విశ్వనాథన్. శక్తికాంత దాస్ ప్రస్తుతం జీ20 పర్యవేక్షణ విధులు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది డిసెంబర్ 31 వరకు ఆయనకు ప్రభుత్వం ఈ బాధ్యతలు అప్పజెప్పింది.
Also read : డిప్యూటీ గవర్నర్ రాజీనామా చేయలేదన్న ఆర్బీఐ !
ఇక ఎన్.ఎస్. విశ్వనాథన్ విషయానికొస్తే, 2016లో ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్‌గా నియమితులైన ఆయన మూడేళ్లపాటు ఆ పదవిలో కొనసాగనున్నారు.