Manik saha tripura New CM: బ్లిపవ్ కుమార్ దేబ్ వారసుడిగా ఎంపీ మాణిక్ సాహా ఎంపికయ్యారు. త్రిపుర నూతన ముఖ్యమంత్రిగా ఆయన బాధ్యతలు చేపట్టనున్నారు. బ్లిపవ్ కుమార్ దేబ్ రాజీనామా చేయడంతో తదుపరి సీఎం ఎవరన్న ఉత్కంఠకు బీజేపీ అధిష్టనం తెరదించింది. సీఎం అధికారిక నివాసంలో బీజేపీ శాసన సభా పక్షం సమావేశమై మాణిక్ సాహాను ఎన్నుకొంది.
త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న మాణిక్ సాహాను తదుపరి సీఎంగా ఎంపిక చేసినట్లు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్ ప్రకటించారు. బీజేపీ శాసన సభా పక్షం భేటీలో మాణిక్ సాహా పేరును బ్లిపబ్ కుమార్ దేబ్ స్వయంగా ప్రకటించారు. మోదీ నేతృత్వంలో రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో మాణిక్ సాహా తీసుకెళతారని ఆశిస్తున్నట్లు బిప్లబ్ ట్వీట్ చేశారు.
అయితే మాణిక్ సాహా పేరును సీఎంగా బ్లిపబ్ దేవ్ శాసన సభా పక్ష సమావేశంలో ప్రకటించిన వెంటనే మంత్రి రామ్ ప్రసాద్ పాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో కాసేపు గందరగోళ వాతావరణం తలెత్తింది. ఎమ్మెల్యేల మధ్య ఘర్షణ జరిగిందనీ.. ఆగ్రహానికి గురైన రామ్ ప్రసాద్ పాల్ కుర్చీలు విరగొట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఉప ముఖ్యమంత్రిగా ఉన్న జిష్ణు దేవ్ వర్మను సీఎంను చేయాలని రామ్ ప్రసాద్ పాల్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది. అయితే కేంద్ర పరిశీలకులుగా వచ్చిన కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్, పార్టీ ప్రధాన కార్యదర్శి వినోద్ తావ్డే సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగినట్లు తెలుస్తోంది.
ఎవరీ మాణిక్ సాహా
మాణిక్ సాహా వృత్తిరీత్యా దంతవైద్యుడు
2020లో త్రిపుర బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు
రాజ్యసభకు మాణిక్ సాహా ప్రస్తుతం ప్రాతినిధ్యం వహిస్తున్నారు
2019లో త్రిపుర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షుడయ్యారు
రాజకీయాల్లోకి రాకముందు ఓ వైద్య కళాశాలలో ప్రొఫెసర్‌గా పని చేశారు
2016లో కాంగ్రెస్‌ను వీడి బీజేపీలో చేరారు.
పలు పత్రికలు, జర్నల్స్‌కు వ్యాసాలు రాయడం మాణిక్ సాహా ప్రవృత్తి
మాణిక్ సాహా బ్యాడ్మింటన్ క్రీడాకారుడు
జాతీయ, యూనివర్సిటీ స్థాయిలో బ్యాడ్మింటన్‌కు ప్రాతినిధ్యం వహించారు
ఇండియన్ డెంటల్ అసోసియేషన్, డెంటల్ కౌన్సిల్‌లో శాశ్వత సభ్యుడిగా ఉన్నారు
Also Read: Biplav Kumar Deb Resigns: త్రిపుర సీఎం పదవికి బిప్లబ్ కుమార్ దేబ్ రాజీనామా.. కారణాలేంటి ?
Also Read: Revanth Reddy Letter to Amit shah: అమిత్ షాకు తొమ్మిది ప్రశ్నలు .. రేవంత్ ఘాటు లేఖ
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook