Republic Day 2024: ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య తేడాలు ఇవే..!

Flag Hoisting And Unfurling Difference: దేశవ్యాప్తంగా నేడు గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించుకునేందుకు రెడీ అవుతున్నారు. మువ్వన్నెల జెండాను ఆవిష్కరించనున్నారు. ఆగస్టు 15న జెండాను ఎగురవేయడానికి.. జనవరి 26న జెండాను ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది.   

Written by - Ashok Krindinti | Last Updated : Jan 26, 2024, 01:20 AM IST
Republic Day 2024: ఆగస్టు 15న జెండా ఎగరవేయడానికి.. జనవరి 26న జెండా ఆవిష్కరించడానికి మధ్య తేడాలు ఇవే..!

Flag Hoisting And Unfurling Difference: మన దేశంలో ఏడాదికి రెండుసార్లు జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆగస్టు 15న స్వాతంత్య్ర  దినోత్సవం, జనవరి 26న గణతంత్ర దినోత్సవం సందర్భంగా దేశవ్యాప్తంగా జెండా పండుగ జరుపుకుంటారు. అయితే ఆగస్టు 15 నాడు జెండా ఎగరవేయడానికి, జనవరి 26 నాడు జెండా ఆవిష్కరించడానికి తేడా ఉంది. 1947 ఆగస్టు 15న బ్రిటిష్ కబంధ హస్తల నుంచి దేశం విముక్తి పొందింది. అందుకే ఆగస్టు 15న దేశవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ప్రతి ఏటా ఊరు వాడ ఏకమై.. మువ్వన్నెల జెండాను ఎగురవేసి సాంస్కృతిక కార్యక్రమాలను ఘనంగా నిర్వహిస్తారు. అలాగే 1950 జనవరి 26న దేశంలో రాజ్యాంగం అమలులోకి వచ్చిన రోజున.. గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ రోజున దేశవ్యాప్తంగా త్రివర్ణ పతాకాన్ని ఆవిష్కరించి.. ఘనంగా గణతంత్ర దినోత్సవాన్ని నిర్వహించుకుంటున్నాం..

స్వాతంత్య్ర  దినోత్సవం రోజున జెండాను ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జెండాను ఆవిష్కరించడానికి మధ్య చిన్న తేడా ఉంది. 

==> ప్రతి సంవత్సరం ఆగస్టు 15న దేశ ప్రధాని న్యూఢిల్లీలోని ఎర్రకోటలో జాతీయ జెండాను ఆవిష్కరిస్తారు. ఆ రోజున జాతీయ పతాకాన్ని స్తంభం దిగువన కడతారు. బ్రిటిష్ పాలన నుంచి భారతదేశం స్వాతంత్య్రాన్ని పొందిందని సూచించడానికి త్రివర్ణ పతాకాన్ని పైకి లాగుతారు. మొదటి స్వాతంత్య్ర దినోత్సవం రోజున బ్రిటిష్ దేశ జెండాను దింపుతూ మన దేశ జెండాను పైకి ఎగురవేశారు. స్వాతంత్య్రం  వచ్చిందని తెలియజేయడానికి ఇలా మువ్వన్నెల జెండాను పైకి లాగి ఎగురవేస్తారు. ఇది కొత్త దేశ ఆవిర్భావానికి ప్రతీకగా నిలుస్తుంది. 
==> గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రతి ఏడాది జనవరి 26న రాష్ట్రపతి జెండాను ఆవిష్కరిస్తారు. జనవరి 26న త్రివర్ణ పతాకాన్ని పైభాగంలో కడతారు. ఆ తరువాత పైకి లాగకుండా విప్పుతారు. ఇలా మువ్వన్నెల జెండాను ఆవిష్కరించడం ద్వారా ఇప్పటికే దేశం స్వతంత్రంగా ఉందని ప్రతీకగా నిలుస్తుంది.
==> స్వాతంత్ర్య దినోత్సవం రోజున జెండాను దేశ ప్రధాని ఎగురవేయడానికి.. గణతంత్ర దినోత్సవం రోజున రాష్ట్రపతి జెండాను ఆవిష్కరించడానికి ఒక కారణం ఉంది.
==> స్వతంత్రం వచ్చిన సమయం నాటికి మన రాజ్యాంగం అమలులోకి రాలేదు. అప్పటికి రాజ్యాంగ అధిపతి రాష్ట్రపతి పదవి చేపట్టలేదు. దీంతో రాజ్యాంగం అమల్లోకి వచ్చిన జనవరి 26న రాష్ట్రపతి గణతంత్ర దినోత్సవం నాడు మువ్వన్నెల జెండాను ఆవిష్కరిస్తారు. 
==> స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి జెండాను ఎగురవేస్తారు (Flag Hoisting).
==> గణతంత్ర దినోత్సవం నాడు రాష్ట్రపతి జెండాను  ఆవిష్కరిస్తారు (Flag Unfurling).
==> అదేవిధంగా స్వాతంత్ర్య, గణతంత్ర దినోత్సవ కార్యక్రమాల వేడుకలు కూడా రెండు వేర్వేరు ప్రదేశాల్లో జరుగుతాయి. 
==> స్వాతంత్ర్య దినోత్సవం ఆగస్టు 15న జెండా ఎగురవేసే కార్యక్రమం ఎర్రకోటలో జరుగుతుంది.
==> గణతంత్ర దినోత్సవం జనవరి 26న రాజ్‌పథ్‌లో జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరుగుతుంది.

Also Read: MP Bandi Sanjay: ఎన్నికల్లో మీ దమ్మేందో చూపించండి.. ఓటనే ఆయుధంతో ఉచకోత కోయండి: బండి సంజయ్

Also Read: Virat Kohli: చరిత్ర సృష్టించిన విరాట్ కోహ్లీ... ప్రపంచంలో ఒకే ఒక్కడు..

అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ - https://bit.ly/3P3R74U

ఆపిల్ లింక్ - https://apple.co/3loQYe 

సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి FacebookTwitter

Trending News