Lion Names Dispute: సింహాలకు అక్బర్, సీత పేర్లు.. ఫారెస్టు అధికారిపై చర్యలు.. కీలక ఆదేశాలు జారీచేసిన కలకత్తా హైకోర్టు..

West Bengal: వెస్ట్ బెంగాల్ లోని శిలిగుడి సఫారీలో పార్కులలో సింహాలకు అక్బర్, సింహా అనే పేర్లు పెట్టడం తీవ్ర వివాదానికి దారితీసిన విషయం తెలిసిందే. దీనిపై కలకత్తా హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది.

Written by - Inamdar Paresh | Last Updated : Feb 26, 2024, 05:56 PM IST
  • సింహాల పేర్లపై సీరియస్ అయిన హైకోర్టు నాయమూర్తి..
  • ఫారెస్ట్ అధికారిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు..
Lion Names Dispute: సింహాలకు అక్బర్, సీత పేర్లు.. ఫారెస్టు అధికారిపై చర్యలు.. కీలక ఆదేశాలు జారీచేసిన కలకత్తా హైకోర్టు..

Akbar-Sita Lion Row Calcutta High Court Verdict: సింహాలకు అక్బర్, సీతా అని పేరుపెట్టడం దేశ వ్యాప్తంగా రచ్చగా మారింది. వెస్ట్ బెంగాల్ లో శిలిగుడి సఫారీలో ఉన్న పార్కులో అక్బర్, సీతాలకు ఆగ, మగ సింహాలకు ఇలా పేరుపెట్టి ఒకే ఎన్ క్లోజర్ లో పెట్టడం తీవ్ర వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే.

Read More: Rashmika-Vijay Devarakonda: ‘నీకోసం నేను వాళ్లను స్పెషల్ గా తీసుకువస్తాను’.. రష్మికకి విజయ్ దేవరకొండ రిప్లై

దీనిపై విశ్వహిందు పరిషత్ కలకత్తా హైకోర్టును ఆశ్రయించింది. ఈ పిటిషన్ ను విచారించిన ధర్మాసరం.. త్రిపుర అటవీశాఖ అధికారిపై మండిపడింది. ఈ క్రమంలో రాష్ట్ర అటవీ వ్యవహరాల ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ప్రబిన్ లాల్ అగర్వాల్ ను సస్పెండ్ చేస్తు హైకోర్టు ఉత్తర్వులు జారీచేసింది.

ఇదిలా ఉండగా.. జంతు మార్పిడి కింద, బెంగాల్ అధికారు ఫిబ్రవరి 12 న త్రిపురలోని సిపాహీజలా జూ పార్కు నుంచి రెండు సింహాలను శిలిగుడి సఫారీ పార్కుకు తీసుకొచ్చారు. రెండింటిని ఒకే ఎన్ క్లోజర్ లో పెట్టడం తీవ్ర రచ్చగా మారింది. దీనిపై విచారణ జరిపిన కోర్టు..సింహాలకు ఆ పేర్లు పెట్టడాన్ని తప్పుపట్టింది.

Read More: Cucumber: సమ్మర్ లో కీర దోసకాయలు ఎక్కువగా తింటున్నారా..?.. ఈ విషయాలు తెలుసుకొండి..

ఈ ఘటన రచ్చగా మారడంతో త్రిపుర ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించింది. కాగా, బెంగాల్ కు సింహాలను అప్పగించేక్రమంలో రిజిస్టర్ లో అక్బర్, సీతా అని పేర్లు పెట్టినట్లు విచారణలో బైటపడింది.  దీంతో అధికారిని కలకత్తా కోర్టు సస్పెండ్ చేసింది. 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి. 

Android Link: https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu 

Apple Link: https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News