Mamata Banerjee Talks to KCR: పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ.. తెలంగాణ సీఎం కేసీఆర్ కు సోమవారం నాడు ఫోన్ చేసి మాట్లాడారు. కాల్ లో వీరిద్దరూ దేశ రాజకీయలపై చర్చించినట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. జాతీయ పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్ లకు ప్రత్యామ్నాయంగా కలిసికట్టుగా పనిచేయాలని సీఎం కేసీఆర్ కు ఆమె పిలుపునిచ్చినట్లు తెలుస్తోంది.
భవిష్యత్తు రాజకీయాల్లో కలిసికట్టుగా పనిచేసేందుకు ఇద్దరు ముఖ్యమంత్రులు నిర్ణయించినట్లు సమచారం. ఉత్తరప్రదేశ్ ఎన్నికల్లో తమ పార్టీ పోటీ చేయడం లేదని ఈ సందర్భంగా మమతా బెనర్జీ స్పష్టం చేశారు. అనేక ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని తాము ఈ నిర్ణయం తీసుకున్నట్లు మమతా బెనర్జీ తెలిపారు.
మార్చి 3వ తేదీన వారణాసిలో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరఫున భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆమె తెలిపారు. అయితే ఈ క్రమంలో తమ టీఎంసీ పార్టీ జాతీయ పార్టీలతో సన్నిహితంగా లేదని దీదీ తేల్చి చెప్పారు.
ప్రస్తుత పరిస్థితుల్లో ఫెడరల్ ఫ్రంట్ సహకారం అవసరమని తెలిపారు. ఇదే విషయమై తమిళనాడు సీఎం ఎంకే స్టాలిన్ తోనూ మాట్లాడినట్లు బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ స్పష్టం చేశారు.
Also Read: CM Kcr: భాజపా నేతలకు దమ్ముంటే నన్ను జైలుకు పంపండి: సీఎం కేసీఆర్
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook