West Bengal bans gutka, pan masala for one year: పాన్ మసాలా, గుట్కా(Gutka)ను నిషేధించేందుకు పలు రాష్ర్టాలు ముందుకొస్తున్నాయి. గతనెల హరియాణా ప్రభుత్వం(Haryana Government) గుట్కా, పాన్ మసాలా(Pan masala) తయారీతో పాటు అమ్మకాలను నిషేధించింది. ఏడాది పాటు అమ్మకం, కొనుగోళ్లపై ఆంక్షలు విధించింది.
తాజాగా పశ్చిమబెంగాల్(West Bengal) ప్రభుత్వం సైతం ఈరెండింటిపై నిషేధం(Ban) విధించింది. ఈ ఏడాది నవంబర్ 7 నుంచి ఇది అమల్లోకి రానుంది. ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్లు పశ్చిమ బెంగాల్ ఆరోగ్య శాఖ నోటిఫికేషన్లో పేర్కొంది.
Also read:Shocking: Youtube వీడియోలు చూస్తూ.. బిడ్డకు జన్మనిచ్చిన మైనర్ బాలిక! లవర్ అరెస్ట్
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ(CM Mamata Banerjee) నేతృత్వంలోని తృణమూల్(TMC) ప్రభుత్వం.. పొగాకు, నికోటిన్ ఉత్పత్తులపై నిషేధం విధించడం ఇదే మొదటిసారి కాదు. 2019లో సైతం గుట్కా, ఇతర పొగాకు ఉత్పత్తులను నిషేధించింది. 2013లో ఖైనీ, పాన్ మసాలా గుట్కాలపై దీదీ ప్రభుత్వం ఒక సంవత్సరం పాటు ఆంక్షలు విధించింది. ఇక దేశంలోని అనేక రాష్ట్రాల్లో నికోటిన్ కలిపిన గుట్కా లేదా పాన్ మసాలా అమ్మకాలపై ఆంక్షలు ఉన్నాయి. ఇప్పటి వరకూ ఉత్తరాఖండ్, బిహార్, దిల్లీ, ఉత్తరప్రదేశ్‌లో సంవత్సరం పాటు ఆంక్షలు విధించారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి