రాహుల్ గాంధీ పోటీ చేసే చోట రీ-పోలింగ్‌కి ఎన్డీఏ అభ్యర్థి డిమాండ్

రాహుల్ గాంధీ పోటీ చేసే చోట రీ-పోలింగ్‌కి ఎన్డీఏ అభ్యర్థి డిమాండ్

Last Updated : Apr 23, 2019, 11:26 AM IST
రాహుల్ గాంధీ పోటీ చేసే చోట రీ-పోలింగ్‌కి ఎన్డీఏ అభ్యర్థి డిమాండ్

వయనాడ్: ఉత్తర్ ప్రదేశ్‌లోని అమేథి లోక్ సభ నియోజకవర్గంతోపాటు కేరళలోని వయనాడ్ లోక్ సభ స్థానం నుంచి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ పోటీచేస్తోన్న సంగతి తెలిసిందే. అయితే, 3వ విడత లోక్ సభ ఎన్నికల్లో భాగంగా నేడు పోలింగ్ జరుగుతున్న వయనాడ్ లోక్ సభ పరిధిలోని ఓ పోలింగ్ కేంద్రంలో ఈవీఎంలు సరిగ్గా పనిచేయడం లేదని ఎన్డీఏ అభ్యర్థి తుషార్ వెళ్లప్పల్లి ఆ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి దృష్టికి తీసుకొస్తూ ఓ లేఖ రాశారు. మూప్పనాడ్ పంచాయత్ పరిధిలోని అరప్పట్టలోని సీఎంఎస్ హయ్యర్ సెకండరీ స్కూల్‌లోని 79వ పోలింగ్ బూత్ వద్ద ఈవీఎం మొరాయించిందని, రెండుసార్లు నొక్కితే కానీ అక్కడ ఓటు నమోదవడం లేదని తన లేఖలో పేర్కొన్న తుషార్.. అలా చేయడం వల్ల ఓటు కూడా మరొకరికి పడే ప్రమాదం లేకపోలేదని ఎన్నికల సంఘం దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేశారు. ఈ కారణంగానే ఇక్కడ రీ-పోలింగ్ నిర్వహించాల్సిన అవసరం ఉందని తుషార్ వెళ్లప్పల్లి డిమాండ్ చేశారు.

3వ విడత లోక్ సభ ఎన్నికలు పోలింగ్ లైవ్ అప్‌డేట్స్, హైలైట్స్

కేరళలో నేడు పోలింగ్ జరుగుతున్న 20 లోక్ సభ నియోజకవర్గాల్లో ఒకటైన వయనాడ్‌ నుంచి మొత్తం 20 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. రాహుల్ గాంధీ మొదటిసారి వయనాడ్ నుంచి పోటీచేస్తుండటంతో దేశవ్యాప్తంగా ఈ లోక్ స్థానం ప్రత్యేక ప్రాధాన్యతను సంతరించుకుంది.

Trending News