వేసవి వచ్చిందంటే చాలు.. వేసవి తాపం నుంచి బయటపడటం కోసం చాలామంది చూపు కూలర్స్, రిఫ్రిజిరేటర్స్, ఏసీలపై పడుతుంది. కూలర్స్ ఎలాగూ లోకల్ మార్కెట్‌లో లభిస్తాయి కనుక వాటి కోసం ఆన్‌లైన్ షాపింగ్ సైట్స్‌లో చూడాల్సిన అవసరం లేదు. ఎటొచ్చీ రిఫ్రిజిరేటర్స్, ఏసీలు లాంటి గృహోపకరణాల కొనుగోలు కోసమే ఆన్‌లైన్ షాపింగ్‌పై ఓ కన్నేస్తుంటారు. అయితే, ఇటీవల కరోనావైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో ఆన్‌లైన్ షాపింగ్ సంస్థలు సైతం ఆర్డర్స్ డెలివరీలు చేయలేక తాత్కాలికంగా తమ వ్యాపారానికి బ్రేకులేసుకున్నాయి. దీంతో తరచుగా ఆన్‌లైన్ షాపింగ్ చేసే వారు ఆ మజాను కోల్పోవాల్సి వచ్చింది.
Also read : COVID-19 updates: 24 గంటల్లో 28 మంది మృతి, 13 వేలకు చేరువలో కరోనా కేసులు
అయితే, తాజాగా ఏప్రిల్ 20 నుంచి లాక్‌డౌన్ నిబంధనలను కొంత సడలించి మళ్లీ బిజినెస్ ఊపందుకునేలా చేసే యోచనలో ఉండటంతో ఆన్ లైన్ షాపింగ్ సైట్స్ సైతం మళ్లీ పూర్తి స్థాయిలో తమ కార్యకలాపాలు ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయి. ఈ పరిస్థితుల్లో బయటికి వెళ్లి మొబైల్ ఫోన్స్ కొనలేని వాళ్లకు, ఎండా కాలం వచ్చింది కదా అని ఏసీలు, ఫ్రిజ్‌లు ఖరీదు చేయాలని ఎదురుచూస్తున్న వారికి ఈ ఆన్‌లైన్ షాపింగ్ వెంటనే భారీ ఉపశమనాన్ని ఇవ్వనుంది. లేదంటే లాక్‌డౌన్ పూర్తిస్థాయిలో ఎత్తేసే వరకైనా వేచిచూడాలి లేదంటే కరోనా వైరస్ ప్రభావం తగ్గే వరకైనా వేచిచూడల్సిందే. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..