Online gambling: విరాట్ కోహ్లీ, తమన్నా అరెస్ట్‌కు పిటిషన్ దాఖలు

విరాట్ కోహ్లీ, మిల్యీ బ్యూటీ తమన్నాలను అరెస్ట్ చేయలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. భారతదేశంలో జూదం ఒక నేరమనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నట్టు సూర్యప్రకాశం తెలిపారు.

Last Updated : Aug 1, 2020, 11:05 PM IST
Online gambling: విరాట్ కోహ్లీ, తమన్నా అరెస్ట్‌కు పిటిషన్ దాఖలు

విరాట్ కోహ్లీ, మిల్యీ బ్యూటీ తమన్నాలను అరెస్ట్ చేయలని కోరుతూ మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. తమన్నా, విరాట్ కోహ్లీ ( Tamannah, Virat Kohli ) ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేయడం ద్వారా యువతను పాడు చేస్తున్నారని ఆరోపిస్తూ చెన్నైకి చెందిన సూర్యప్రకాశం అనే న్యాయవాది మద్రాస్ హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలు చేశారు. యువతను చెడగొడుతున్న ఆన్‌లైన్ జూదంపై ( Online gambling ) తక్షణమే నిషేధం విదించడంతో పాటు ఆన్‌లైన్ జూదం ఆడే వెబ్‌సైట్స్, మొబైల్ యాప్స్‌ను నిర్వహిస్తున్న వ్యక్తులను అరెస్టు చేసి విచారించాలని సూర్యప్రకాశం హైకోర్టును ( Madras High court) కోరారు. అలాగే ఆన్‌లైన్ గ్యాంబ్లింగ్‌ను ప్రమోట్ చేస్తున్న ప్రముఖులను సైతం అరెస్ట్ చేయాలని ఆయన తన పిటిషన్‌లో పేర్కొన్నారు. భారతదేశంలో జూదం ఒక నేరమనే విషయాన్ని ఈ సందర్భంగా మరోసారి న్యాయస్థానం దృష్టికి తీసుకొస్తున్నట్టు సూర్యప్రకాశం తెలిపారు. Also read: Official music videos: ఫేస్‌బుక్ నుంచి మరో కొత్త ఫీచర్

తమన్నా, విరాట్ కోహ్లీ వంటి ప్రముఖులు సోషల్ మీడియాలో ఈ యప్స్ ద్వారా ఎక్కువ డబ్బుని సంపాదించవచ్చు అని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది యువకులు "బ్రెయిన్ వాష్" అవుతున్నారని, అలా చాలా మంది తమ డబ్బును కోల్పోతున్నారని పిటిషనర్ ఆవేదన వ్యక్తంచేశారు. విరాట్ కోహ్లీ, తమన్నా భాటియా ఇద్దరూ మొబైల్ ప్రీమియర్ లీగ్ (MPL) అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ను ప్రమోట్ చేస్తున్న సంగతి తెలిసిందే. Also read: Allu Arjun: తారక్ వద్దంటే.. బన్నీ ఒప్పుకున్నాడా ?

Trending News