Jammu Terror Attack: సుంజ్వాన్ లోని CISF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..?

Jammu Kashmir: జమ్మూకాశ్మీర్‌లోని సుంజ్వాన్ ప్రాంతంలో జరిగిన ఉగ్రదాడి యొక్క సీసీటీవీ ఫుటేజీ శనివారం బయటకు వచ్చింది. పూర్తి వివరాల్లోకి వెళితే..   

Edited by - ZH Telugu Desk | Last Updated : Apr 23, 2022, 02:53 PM IST
Jammu Terror Attack: సుంజ్వాన్ లోని CISF జవాన్ల బస్సుపై ఉగ్రవాదులు ఎలా దాడి చేశారంటే..?

Jammu Kashmir Terror Attack: భారత ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) ఆదివారం జమ్మూకశ్మీర్(Jammu Kashmir) లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఉగ్రవాదులు ఆత్మాహుతి దాడికి చేసిన ప్రయత్నం విఫలమైంది. ఈ క్రమంలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఇద్దరు ఉగ్రవాదుల హతమయ్యారు. ఈ ఘటనలో ఓ జవాన్ వీరమరణం పొందగా... మరో తొమ్మిది మంది గాయపడ్డారు. అయితే దాడికి సంబంధించిన సీసీటీవీ పుటేజీ తాజాగా బయటకు వచ్చింది. ఇందులో సీఐఎస్ఎఫ్ సిబ్బంది బస్సు (CISF Bus)సుంజువాన్ ప్రాంతం గుండా వెళ్తున్నట్లు కనిపించింది. కొద్ది సేపటికి ఓ బైక్ అటుగా వెళ్తున్నప్పుడు పేలుడు శబ్ధం వినబడడం మెుదలవుతుంది. 

సాంబ జిల్లా పల్లి పంచాయితీలో ఆదివారం ప్రధాని మోదీ పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఆ ప్రాంతమంతా రెడ్ అలర్ట్ ప్రకటించారు. డీజీపీ దిల్ బాగ్ సింగ్ ఎన్ కౌంటర్ జరిగిన ప్రదేశాన్ని సందర్శించారు. మృతి చెందిన ఇద్దరు ఉగ్రవాదులు పాకిస్తాన్ ఆధారిత జైష్ ఎ మహ్మద్ (Jaish-e-Mohammad) ఆత్మాహుతి దళంలో భాగమేనని ఆయన పేర్కొన్నారు. అంతేకాకుండా వారు దేశంలోకి చొరబాటుకు ప్రయత్నించారని పోలీసులు వెల్లడించారు. ఈ ప్రాంతాన్ని ఎన్ఐఏ, రాష్ట్ర దర్యాప్తు సంస్థలు సందర్శించి.. ప్రాథమిక విచారణ చేపట్టాయి. ప్రధాని కశ్మీర్ పర్యటనను భగ్నం చేసేందుకు ఉగ్రవాదులు కుట్ర పన్నారని డీజీపీ దిల్ బాగ్ సింగ్ తెలిపారు. 

Also Read: Jammu Kashmir Encounter: జమ్ముకశ్మీర్‌లో బారాముల్లాలో భారీ ఎన్‌కౌంటర్‌...నలుగురు ఉగ్రవాదుల హతం 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.

 

Trending News