Vande Bharat Trains: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్‌లు.. అందుబాటులోకి ఎప్పుడంటే..?

Vande Bharat Sleeper Coach Train: వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు సూపర్ సక్సెస్ అయ్యాయి. తక్కువ టైమ్‌లోనే గమ్యాన్ని చేరుకునే అవకాశం ఉండడంతో ప్రయాణికులు ఈ రైళ్ల ప్రయాణించేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం చైర్ కార్‌లు అందుబాబులో ఉండగా.. త్వరలో స్లీపర్ కోచ్‌లు అందుబాటులోకి రానున్నాయి.   

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 20, 2023, 09:02 AM IST
Vande Bharat Trains: వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లో స్లీపర్ కోచ్‌లు.. అందుబాటులోకి ఎప్పుడంటే..?

Vande Bharat Sleeper Coach Train: దేశంలో వందే భారత్ రైళ్లు పరుగులు పెడుతున్నాయి. తక్కువ సమయంలోనే ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండడంతో ప్రయాణికుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. అంతేకాదు ఇందులోని అత్యధుని వసతులు ప్రయాణికులకు తెగ నచ్చేశాయి. ప్రస్తుతం సీటింగ్ కోచ్‌లు అందుబాటులో ఉండగా.. త్వరలోనే స్లీపర్ కోచ్‌లు కూడా ప్రవేశపెట్టేందుకు రెడీ అవుతోంది ఇండియన్ రైల్వేస్. ఇప్పటికే రైల్వే శాఖ వందేభారత్ రైలును స్లీపర్ కోచ్‌లతో రూపొందించే పనిని ప్రారంభించింది. 

200 వందే భారత్ రైళ్లను రైల్వే శాఖ తయారు చేస్తోందని.. ఇందులో స్లీపర్ కోచ్‌ల సౌకర్యం కూడా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. రైల్వే వర్గాలు తెలిపిన వివరాల ప్రకారం.. మేధా, ఐసీఎఫ్ చెన్నై అనే ప్రైవేట్ సంస్థలు వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌ను స్లీపర్ క్లాస్‌తో తయారు చేసేందుకు ఆర్డర్‌ను పొందాయి. ఇందుకు సంబంధించిన టెండర్ల ప్రక్రియను ఈ నెలాఖరులోగా ఖరారు చేయనున్నారు. 2025 సంవత్సరం చివరి నాటికి 278 వందేభారత్ రైళ్లు పట్టాలపై పరుగులు తీస్తాయని అంటున్నారు. 

రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. వందేభారత్ సిరీస్‌లో భాగంగా తొలి దశలో 78 రైళ్ల తయారీ పనులు కొనసాగుతున్నాయి. ఈ రైళ్లన్నీ తక్కువ దూరాన్ని కలిగి ఉంటాయి. వీటిలో సీటింగ్‌కు మాత్రమే అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఇలాంటి 8 వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు పట్టాలపై పరుగులు పెడుతున్నాయి. ఈ ఏడాది ఆగస్టు 15 నాటికి దేశంలో 75 వందేభారత్ రైళ్లు నడుస్తాయని ప్రధాని నరేంద్ర మోదీ గతేడాది ఎర్రకోట నుంచి ప్రకటించారు. ఈ గడువు సమీపిస్తోంది. టెండర్లు పొందిన రెండు కంపెనీలు వేగంగా ఈ లక్ష్యాన్ని చేరుకోవడానికి కృషి చేస్తున్నాయి. ప్రస్తుతం తయారు చేయడంలో నిమగ్నమై ఉన్నాయి. 

చైర్ కార్లతో 78 రైళ్లను నడిపిన తర్వాత.. స్లీపర్ కోచ్‌లతో కూడిన 200 వందే భారత్ స్లీపర్ కోచ్ రైళ్ల నిర్మాణ పనులు ప్రారంభమవుతాయి. 2025 సంవత్సరం చివరి నాటికి 278 వందే భారత్ రైళ్లు పట్టాలపై నడుస్తాయని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ చెబుతున్నారు. 2027 నాటికి దేశంలో 478 వందేభారత్ రైళ్లు ప్రయాణికులను చేరవేస్తాయంటున్నారు. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్‌లో స్లీపర్, చైర్ కార్ రెండూ ఉంటాయని చెబుతున్నారు. వందే భారత్ రైళ్లలో స్లీపర్ కోచ్‌లు అందుబాటులోకి వస్తే.. ప్రయాణికుల నుంచి భారీ డిమాండ్ వచ్చే అవకాశం ఉంది. దూర ప్రయాణం చేసే ప్రయాణికులకు ఎంతో సౌకర్యవంతంగా ఉంటుంది.  

Also Read: Hockey India: వరల్డ్‌కప్‌లో టీమిండియా రెండో విజయం.. క్వార్టర్ ఫైనల్ చేరాలంటే..  

Also Read: AP Govt: డీఏ చెల్లింపునకు సీఎం జగన్ ఒకే.. అందుకే జాప్యం: ఏపీఎన్జీవో

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitterFacebook

Trending News