న్యూఢిల్లీ: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అగ్రనేత అటల్ బిహారీ వాజపేయి 93వ వడిలో అడుగుపెట్టిన సందర్భంగా ఆయనకు రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.
రాష్ట్రపతి ట్విట్టర్లో ఇలా రాశారు: "మన ప్రియమైన మరియు గౌరవనీయులైన మాజీ ప్రధాని శ్రీ అటల్ బిహారీ వాజపేయికి పుట్టినరోజు శుభాకాంక్షలు"
Birthday wishes to our much-loved and respected former Prime Minister, Shri Atal Bihari Vajpayee #PresidentKovind
— President of India (@rashtrapatibhvn) December 25, 2017
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా బీజేపీ అగ్రనేతకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్లో ఆయన ఈ విధంగా రాశారు: "మన ప్రియమైన అటల్ జీకి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన అసాధారణ, అద్భుత నాయకత్వంతో భారతదేశం మరింత అభివృద్ధి చెదింది మరియు ప్రపంచ వేదికపై మన గౌరవాన్ని పెంచింది. ఆయన ఆరోగ్యంగా ఉండాలని భగవంతుణ్ణి ప్రార్దిస్తా"
Birthday greetings to our beloved Atal Ji. His phenomenal as well as visionary leadership made India more developed and further raised our prestige at the world stage. I pray for his good health.
— Narendra Modi (@narendramodi) December 25, 2017
రక్షణ శాఖ మంత్రి నిర్మల సీతారామన్, మాజీ ప్రధానికి పుట్టినరోజు విషెష్ చెప్పారు. "ఆరాధకుడైన నాయకుడు, స్ఫూర్తినిచ్చే నాయకుడైన శ్రీ అటల్ బిహారీ వాజపేయికి పుట్టినరోజు శుభాకాంక్షలు. ఆయన ఆరోగ్యంగా ఉండాలని నేను ప్రార్థిస్తాను" అని నిర్మలా సీతారామన్ ట్వీట్ చేశారు.
Birthday greetings to Shri Atal Bihari Vajpayee, a very inspiring and a much admired leader. My prayers for his better & improved health.
— Nirmala Sitharaman (@nsitharaman) December 25, 2017
భారత రాజకీయాల్లో అటల్ జీ ఒక పరిణతి చెందిన నాయకుడు. బీజేపీ పార్టీని 1999-2004 వరకు పూర్తికాలం అధికారంలో ఉంచిన ఘనత ఆయనకే దక్కుతుంది. నాలుగు దశాబ్దాలుగా పార్లమెంటులో సభ్యులుగా ఉన్నారు వాజపేయి. లోక్ సభ కు (భారత పార్లమెంటు దిగువ సభ) పదిసార్లు, రాజ్యసభకు (ఎగువ సభ) రెండుసార్లు ఎన్నికయ్యారు.ఆరోగ్య సమస్యల కారణంగా అతను క్రియాశీల రాజకీయాల నుండి వైదొలిగారు.
మార్చి 27, 2015న భారత రాష్ట్రపతి, భారతదేశ అత్యున్నత పౌర పురస్కారం 'భారత రత్న'ను వాజపేయికి ప్రదానం చేశారు. 2014లో నరేంద్రమోదీ నేతృత్వంలోని ప్రభుత్వం వాజపేయి యొక్క పుట్టినరోజును 'మంచి పాలన దినోత్సవం (గుడ్ గవర్నెన్స్ డే)' గా ప్రకటించింది.