ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపికి షాక్ ఇచ్చిన ఓటర్లు

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఇవాళ వెల్లడైన ఫలితాల్లో ఓటర్ల నుంచి భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ ఎదురైంది.

Last Updated : Mar 14, 2018, 05:59 PM IST
ఉత్తర్ ప్రదేశ్‌లో బీజేపికి షాక్ ఇచ్చిన ఓటర్లు

ఉత్తర్ ప్రదేశ్‌లోని ఫూల్‌పూర్, గోరఖ్‌పూర్ లోక్ సభ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలకు సంబంధించి ఇవాళ వెల్లడైన ఫలితాల్లో ఓటర్ల నుంచి భారతీయ జనతా పార్టీకి గట్టి షాక్ ఎదురైంది. ఫూల్‌పూర్‌లో సమాజ్ వాదీ పార్టీ అభ్యర్థి నాగేంద్ర ప్రతాప్ సింగ్ 59,000 ఓట్ల మెజార్టీతో గెలుపొందడం బీజేపీ శ్రేణులకి గట్టి షాక్‌ని ఇచ్చింది. నాగేంద్ర ప్రతాప్ సింగ్‌ని అభ్యర్థిగా నిలబెట్టిన సమాజ్ వాదీ పార్టీకి బహుజన్ సమాద్ వాదీ పార్టీ నుంచి కూడా మద్దతు లభించింది. దీంతో ఉత్తర్ ప్రదేశ్‌లో అధికార పార్టీ అయిన బీజేపీ అభ్యర్థి కౌశ్లేంద్ర సింగ్ పటేల్‌పై నాగేంద్ర ప్రతాప్ సింగ్ భారీ మెజార్టీతో విజయం సాధించారు.

ఇదిలావుంటే, మరోవైపు సీఎం యోగి ఆదిత్యనాధ్ సొంత లోక్ సభ నియోజకవర్గమైన గోరఖ్ పూర్‌లోనూ ఈ ఉప ఎన్నిక బీజేపీకి చేదు అనుభవాన్నే మిగిల్చింది. గోరఖ్ పూర్ ఉప ఎన్నిక ఫలితాల్లో 25వ రౌండ్ ముగిసిన తర్వాత బీజేపీ అభ్యర్థి ఉపేంద్ర దత్ శుక్లాపై ప్రవీణ్ కుమార్ నిశద్ 22,954 ఓట్ల మెజార్టీతో ముందంజలో వున్నారు. 

Trending News