Ustad Ghulam Mustafa Khan: సంగీత విద్వాంసుడు ముస్తఫా కన్నుమూత

ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత ఉస్తాద్‌ గులామ్‌ ముస్తఫా ఖాన్‌ (89) కన్నుమూశారు. ముంబై బాంద్రాలోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ముస్తఫా ఖాన్ తుదిశ్వాస విడిచారు.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 18, 2021, 07:03 AM IST
Ustad Ghulam Mustafa Khan: సంగీత విద్వాంసుడు ముస్తఫా కన్నుమూత

Ustad Ghulam Mustafa Khan passes away | ముంబై: ప్రముఖ శాస్త్రీయ సంగీత విద్వాంసుడు, పద్మవిభూషణ్‌ అవార్డు గ్రహీత ఉస్తాద్‌ గులామ్‌ ముస్తఫా ఖాన్‌ (89) కన్నుమూశారు. ముంబై (Mumbai) బాంద్రాలోని ఆయన నివాసంలో ఆదివారం మధ్యాహ్నం ముస్తఫా ఖాన్ తుదిశ్వాస విడిచారు. అనంతరం శాంతాక్రూజ్ శ్మశాన వాటికలో ఆదివారం సాయంత్రం రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో గౌరవ మర్యాదలతో ముస్తఫా ఖాన్ (Ustad Ghulam Mustafa Khan) అంత్యక్రియలు పూర్తయ్యాయి. ఉదయం ఆయన ఆరోగ్యంగానే ఉన్నారని, అయితే మధ్యాహ్నం వాంతులతో అస్వస్తతకు గురయ్యారని ఉస్తాద్‌ కోడలు నమ్రతా గుప్తా ఖాన్‌ తెలిపారు. డాక్టర్లు ఇంటికి వచ్చేలోపునే ఆయన తుదిశ్వాస విడిచారని పేర్కొన్నారు. 

2019లో బ్రెయిన్‌ స్ట్రోక్‌ రావడంతో అప్పటి నుంచి ముస్తఫా మంచానికే పరిమితమయ్యారు. ఉత్తరప్రదేశ్‌ బదౌన్‌లో మార్చి 3, 1931లో ముస్తఫా జన్మించారు. ఆయన.. తండ్రి దగ్గర శాస్త్రీయ గాత్ర సంగీతంలో శిక్షణపొందిన తర్వాత, మేనమామ ఉస్తాద్‌ నిస్సార్‌ హుస్సేన్‌ ఖాన్‌ దగ్గర శిక్షణను పూర్తిచేశారు. ఖాన్‌ మృతికి ప్రధాని నరేంద్రమోదీ (PM Narendra Modi), హోంమంత్రి అమిత్ షా, లతామంగేష్కర్‌, ఏఆర్ రెహ్మాన్‌ తదితరులు ప్రగాఢ సంతాపం తెలిపారు. Also Read: COVID-19 Vaccine: కోవిడ్-19 టీకా ఎవరెవరు తీసుకోకూడదు.. తెలుసా?

Also Read: COVID-19 vaccination: తొలి రోజు వ్యాక్సినేషన్ డ్రైవ్ విజయవంతం

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News