మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్‌కు చెందిన ఈ బామ్మ పేరు ఊర్మిళ చతుర్వేది ( Urmila Chaturvedi ). వయసు 82 సంవత్సరాలు. మధ్యప్రదేశ్‌లోని జబల్‌పూర్ ఆమె స్వస్థలం. అయోధ్యలో రామ మందిరం నిర్మాణం ( Ram temple ) కోసం గత 28 ఏళ్లుగా ఆహారం మానేసి మరీ ఎదురుచూస్తున్నారు. రాముడి భక్తురాలైన చతుర్వేది 1992లో అయోధ్యలో అల్లర్లు, మత కలహాలు జరిగిన అనంతరం అప్పటి పరిస్థితిపై కలత చెందిన ఆమె ఓ కఠిన నిర్ణయం తీసుకుంది. అదేమంటే... రామ మందిరం నిర్మించేవరకు తాను అన్నం ముట్టబోనని. అప్పటి నుంచి ఇప్పటివరకు పండ్లు, పాలు, పెరుగు మీదనే బతుకుతోందే తప్ప అన్నం ముట్టలేదు. రామాలయం నుండి ‘ప్రసాదం’ తిన్న తర్వాతనే ఉపవాసం ( Fasting ) విరమించుకుంటానని ఆమె చెప్పింది. Also read: Ram Temple: అమెరికాలో అయోధ్య రామయ్య వెలుగులు
ఆమె తన జీవితంలో 28 సంవత్సరాల నుండి ఉపవాసం చేస్తూ, రామాయణం చదువుతూ, ప్రార్థనలు చేస్తూ కాలం వెళ్లదీస్తోంది. చాలాసార్లు ఆమె కుటుంబసభ్యులు, బందువులు ఉపవాస దీక్షని విరమించమని ఒప్పించడానికి ప్రయత్నించినప్పటికీ.. ఊర్మిళ చతుర్వేది అందుకు అంగీకరించలేదు. రామ మందిరానికి పునాది వేసే భూమి పూజ కార్యక్రమం ( Ram temple bhoomi pujan ) ఆగస్టు 5న అనగా ఈ రోజు అయోధ్యలో పూర్తయింది. ఇకనైనా ఆ బామ్మ ఉపవాస దీక్ష విరమించుకుంటారో లేదో చూడాల్సిందే మరి. నేడు అయోధ్యలో రామ జన్మభూమిలో జరిగిన రామ మందిరం భూమి పూజ కార్యక్రమంలో ప్రధాని నరేంద్ర మోదీ పాల్గొని పునాది రాయి వేశారు. Also read: Asaduddin Owaisi: రామ మందిరం భూమి పూజ.. అసదుద్దీన్ సంచలన ట్వీట్
Ram temple: రామ మందిరం కోసం 28 ఏళ్లుగా మరో శబరి ఉపవాసం