UPSE IES/ISS Notification 2021: నిరుద్యోగులకు శుభవార్త. యూపీఎస్సీ ఐఈఎస్, ఐఎస్ఎస్ నోటిఫికేషన్ విడుదలైంది. కేంద్ర ఆర్ధిక మంత్రిత్వశాఖలో ఉన్నత స్థాయి ఉద్యోగాల భర్తీ కోసం వెలువడిన నోటిఫికేషన్ వివరాలిలా ఉన్నాయి.
యూపీఎస్సీ(UPSC) ప్రతియేటా ఐఈఎస్, ఐఎస్ఎస్ నోటిఫికేషన్ ( IES/ISS Notification) విడుదల చేస్తుంటుంది. ఇందులో భాగంగా ఈసారి UPSC IES/ISS-2021 నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో కేంద్ర ఆర్ధిక మంత్విత్వ శాఖ( Union Finance Ministry), అనుబంధ విభాగాల్లో ఉన్నతస్థాయి ఉద్యోగాల భర్తీకై షెడ్యూల్ ఉంది. ఇండియన్ ఎకనామిక్ సర్వీస్, ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ పోస్టుల్ని భర్తీ చేయనున్నారు. ఐఈఎస్ కేటగరీలో 15 ఉన్నత స్థాయి పోస్టులు, ఐఎస్ఎస్ కేటగరీలో 11 ఉన్నత స్థాయి పోస్టులు మొత్తం 26 ఖాళీలున్నాయి. దీనికి సంబంధించి అర్హతలు, ఎంపిక విధానం వివరాలివీ..
ఇండియన్ ఎకనామిక్ సర్వీస్ ( Indian Economic Service) కోసం గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఎకనామిక్స్ లేదా అప్లయిడ్ ఎకనామిక్స్ లేదా బిజినెస్ ఎకనామిక్స్ లేదా ఎకనోమెట్రిక్స్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ ఉత్తీర్ణత ఉండాలి. ఇక ఇండియన్ స్టాటిస్టికల్ సర్వీస్ ( Indian Statistical service) కోసం స్టాటిస్టిక్స్ లేదా మ్యాథమెటికల్ స్టాటిస్టిక్స్ లేదా అప్లయిడ్ స్టాటిస్టిక్స్ ఒక సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ లేదా ఆయా సబ్జెక్టుల్లోని ఒకదానిలో పోస్టు గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణులై ఉండాలి. ఈ రెండింటికీ వయసు: 2021 ఆగస్టు 1 నాటికి 21–30ఏళ్ల మధ్య ఉండాలి. 1991 ఆగస్టు 2 నుంచి 2000 ఆగస్టు 1 మధ్య జన్మించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు గరిష్ట వయసులో సడలింపు లభిస్తుంది.
ఇక ఎంపిక విధానం ఎలా ఉంటుందంటే..రాత పరీక్ష, వైవా వాయిస్‌లో ప్రతిభ ఆధారంగా ఎంపిక జరుగుతుంది. రాత పరీక్షకు 1000 మార్కులు, వైవా వాయిస్‌కు 200 మార్కులు కేటాయించారు. ఆఫ్‌లైన్‌లో విధానంలో పరీక్ష జరుగుతుంది. రాత పరీక్షలో అర్హత సాధించిన వారిని వైవా వాయిస్‌కు పిలుస్తారు. మొ త్తంగా 1200 మార్కులకు అభ్యర్థులు సాధించిన స్కోర్ ఆధారంగా, రిజర్వేషన్లను అనుసరించి తుది ఎంపిక జరుగుతుంది.
ఆన్‌లైన్‌లో దరఖాస్తు ( Online Application) చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేది ఏప్రిల్ 27 వతేదీ 2021. ఎస్సీ/ఎస్టీ, దివ్యాంగులు, మహిళలకు ఫీజు నుంచి మినహాయింపు ఉంది. మిగతా అభ్యర్థులు 2 వందల ఫీజు చెల్లించాలి. జూలై 16 నుంచి పరీక్షలు నిర్వహించనున్నారు. ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ కోసం https://www.upsconline.nic.in సంప్రదించాల్సి ఉంటుంది.
Also read: Mumbai: ఆపదలో ఉన్నవారికి ఉచితంగా ఆక్సిజన్ సరఫరా కోసం ఫోర్డ్ కారు అమ్ముకున్న యువకుడు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook