UPSC NDA I and II Written Exam Results 2020: యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్షల ఫలితాలు విడుదల

ఆర్మీ, నేవీలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC NDA I and II రాత పరీక్షల ఫలితాలు (UPSC NDA I and II Written Exam 2020 Results) విడుదలయ్యాయి. అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చునని సూచించారు.

Last Updated : Oct 11, 2020, 03:13 PM IST
UPSC NDA I and II Written Exam Results 2020: యూపీఎస్సీ ఎన్డీఏ పరీక్షల ఫలితాలు విడుదల

ఇండియన్ ఆర్మీ, నేవీలో ఉద్యోగాల భర్తీకి నిర్వహించిన UPSC NDA I and II రాత పరీక్షల ఫలితాలు (UPSC NDA I and II Written Exam Results 2020) విడుదలయ్యాయి. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) అక్టోబర్ 10న ఈ ఫలితాలను విడుదల చేసింది. యూపీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు అందుబాటులో ఉంచామని, అభ్యర్థులు తమ వివరాలు నమోదు చేసి రిజల్ట్స్ చూసుకోవచ్చునని సూచించారు.

యూపీఎస్సీ ఎన్డీఏ I మరియు II రాత పరీక్షలో ఉత్తీర్ణులై, స్టాఫ్ సెల‌క్షన్ బోర్డ్ (ఎస్ఎస్‌బీ) ఇంటర్వ్యూకు ఎంపికైన అభ్యర్థుల వివరాలు (UPSC NDA I and II written exam result 2020 declared) మాత్రమే వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు. 
UPSC NDA I and II రాత పరీక్షల ఫలితాలు కోసం క్లిక్ చేయండి

ఇంటర్వ్యూకి ఎంపికైన వారు రెండు వారాల్లోగా జాయిన్ అవుతున్నట్లు ఈ వెబ్‌సైట్ (http://joinindianarmy.nic.in) ద్వారా దరఖాస్తు చేసుకోవాలని యూపీఎస్సీ సూచించింది. ఎన్డీఏ 1 లో డిఫెన్స్ అకాడమీకి 370 పోస్టులు, నేవీలో 44 పోస్టులు భర్తీ చేస్తారు. ఎన్డీఏ 2లో డిఫెన్స్ అకాడమీకి 370 పోస్టులు, నేవీకి 43 పోస్టులున్నాయి.
రిజిస్ట్రేషన్ అయ్యేందుకు క్లిక్ చేయండి

నేషనల్ డిఫెన్స్ అకాడమీ, ఎన్డీఏ (145, 146వ బ్యాచ్), నేవల్ అకాడమీ , ఎన్ఏ (106, 17వ బ్యాచ్) పరీక్షలు షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ నెలలో జరగాల్సి ఉంది, కానీ లాక్‌డౌన్, కరోనా వ్యాప్తి కారణంగా వాయిదా పడ్డాయి. సెప్టెంబర్ నెలలో పరీక్షలు నిర్వహించి తాజాగా ఫలితాలు వెల్లడించారు.

 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News