Union Government: పెట్రోల్, డీజిల్ ధరల పెంపునకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. 2021-22 ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్ ధరలను 78 సార్లు, డీజిల్ ధరను 76 సార్లు పెంచింది. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వమే రాజ్యసభలో తెలిపింది. ఇదే సమయంలో పెట్రోల్ ధరలను ఏడు సార్లు, డీజిల్ ధరలను 10 సార్లు తగ్గించామని ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పెట్రోల్, డీజిల్ ధరలను ఐదు సార్లు పెంచినట్లు పేర్కొంది.
దేశంలో క్రమేపి పెట్రోల్, డీజిల్ పెరుగుతుండటంతో మే నెలలో కేంద్రం దిద్దుపాటు చర్యలు చేపట్టింది. పెట్రో మంటలతో అల్లాడుతున్న ప్రజలకు ఉపసమనం కల్పించింది. లీటర్ పెట్రోల్‌పై రూ.8, డీజిల్‌పై రూ.6 ఎక్సైజ్ సుంకం తగ్గించింది. దీంతో లీటర్ పెట్రోల్‌పై రూ.10, లీటర్ డీజిల్‌పై రూ.7 తగ్గింది. ఈక్రమంలో దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు దిగి వచ్చాయి. ఐదు రాష్ట్రాల ఎన్నికల దృష్టిలో ఉంచుకునే కేంద్రం ఇలాంటి నిర్ణయం తీసుకుందని అప్పట్లో ప్రచారం జరిగింది.
రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ వడ్డింపు ఉండనుందని తెలుస్తోంది. ఈమేరకు ప్రభుత్వంపై చమురు సంస్థలు ఒత్తిడి తీసుకొస్తున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. ప్రధాన రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగియడంతో త్వరలో ధరల పెంపు ఉంటుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు.
Also read:Shiv Sena: ఈసీని నిలువరించండి..సుప్రీం కోర్టును ఆశ్రయించిన ఉద్దవ్ ఠాక్రే వర్గం..!
Also read:Etela Rajendar: సీఎం కేసీఆర్‌పై పోటీ చేసి ఓడిస్తా..ఈటల రాజేందర్ హాట్ కామెంట్స్..!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.