ఆ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..

ఇప్పటివరకూ అంతర్జాతీయంగా విమాన సర్వీసుల ప్రయాణికులకు అందుబాటులో ఉన్న సేవలు త్వరలో డొమెస్టిక్ విమాన ప్రయాణికులకు అందుబాటులోకి రానున్నాయి.

Last Updated : Mar 2, 2020, 02:02 PM IST
ఆ విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్..

న్యూఢిల్లీ: అతి వేగంగా మనకు కావాల్సిన ప్రాంతానికి చేరుకోవాలంటే ఉపయోగించే రవాణా మార్గం విమానయానం. అయితే విమానాల్లో ప్రయాణం ప్రశాంతంగా, ఏ చికాకు లేకుండా సాగిపోతుంది. కానీ ఇంటర్నెట్ లాంటి సౌకర్యాలు వాడుకునే వీలుండదు. మీ మొబైల్ ఫోన్లు ఏరోప్లేన్ మోడ్‌లో పెట్టండి లేక స్విచ్ఛాఫ్ చేసుకోండి అని ఫ్లైట్ సిబ్బంది, ఎయిర్ హోస్టెస్ అనౌట్ చేస్తుంటారు. 

అయితే కొన్ని రోజుల్లో విమాన ప్రయాణికులు వైఫై సేవలు అందుబాలోకి రానున్నాయి. ప్రయాణికులకు వైఫై అందించేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దీనిపై అధికారిక ప్రకటనలో తెలినట్లు సమాచారం. విమాన పైలట్ ఇన్ కమాండ్ తమ ప్రయాణికులకు వైఫై సేవలకు అనుమతి కల్పించవచ్చునని కేంద్రం తెలిపింది. మొబైల్స్, ల్యాప్ ట్యాప్, ట్యాబ్లెట్, స్మార్ట్ వాచ్, ఈ రీడర్ లాంటి ఎలక్ట్రానిక్ పరికరాలతో వైఫై వినియోంచుకోవచ్చునని సూచించింది. కానీ ఆ పరికరాలు ఏరోప్లేన్ మోడ్, లేక ఫ్లైట్ మోడ్‌లో ఉంచిన తర్వాతే ఈ సేవలు అందుబాటులోకి వస్తాయి.

See Pics: ఆ ఫొటోలపై ఇవాంక ట్రంప్ ఏమన్నారో తెలుసా?  

విమానంలో వైఫై సేవలపై విస్తారా సీఈఓ లెస్లీ థంగ్ స్పందించారు. బోయింగ్ 787-9 ఎయిర్ క్రాఫ్ట్ వైఫై సేవల్ని అందించే తొలి విమాన సర్వీసు కానుందని వెల్లడించారు. ఇప్పటివరకూ అంతర్జాతీయ విమాన సేవలు అందించే విమానాల్లో మాత్రమే అందుబాటులో ఉన్న వైఫై సేవలు డొమెస్టిక్ విమాన ప్రయాణాలకు అందుబాటులోకి రానున్నాయి. ప్రయాణించే కొన్ని గంటల సమయంలోనూ ఏ ఇబ్బంది లేకుండా తమ అత్యవసర పనులకు, ఎంటర్‌టైన్మెంట్ కోసం ఇంటర్ నెట్ వాడుకునే సదుపాయాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పించింది.

See Photos: అక్కాచెల్లెళ్లు కాదు.. తల్లీకూతుళ్లు!

జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News