Budget 2021: Corona Vaccine కోసం బడ్జెట్ 2021లో భారీ కేటాయింపులు, అధునాతన వైరల్ ల్యాబ్‌లు

Rs 35,000 Crore for Covid-19 Vaccines And Further Support: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్ (Budget 2021-22)ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్‌ తయారు చేశామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో భారతదేశంలో లాక్‌డౌన్‌ విధించకపోతే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేదన్నారు. 

Written by - Shankar Dukanam | Last Updated : Feb 1, 2021, 12:18 PM IST
  • ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్
  • కరోనా సమయంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగం
  • కేంద్ర బడ్జెట్ 2021లో కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించారు
Budget 2021: Corona Vaccine కోసం బడ్జెట్ 2021లో భారీ కేటాయింపులు, అధునాతన వైరల్ ల్యాబ్‌లు

Budget 2021: Rs 35,000 Crore for Covid-19 Vaccines And Further Support: కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఫిబ్రవరి 1న పార్లమెంటులో ఉదయం 11 గంటలకు సాధారణ బడ్జెట్ (Budget 2021-22)ను లోక్‌సభలో ప్రవేశపెట్టారు. దేశ ప్రజల అవసరాలకు అనుగుణంగా విపత్కర పరిస్థితుల్లో బడ్జెట్‌ తయారు చేశామన్నారు. కరోనా వైరస్ వ్యాప్తి సమయంలో భారతదేశంలో లాక్‌డౌన్‌ విధించకపోతే మరింత నష్టాన్ని చవి చూడాల్సి వచ్చేదన్నారు. 

వైద్యం సహా ఇతర అత్యవసర సేవల రంగంలో పనిచేసిన వారందరూ తమ ప్రాణాలను రిస్క్‌లో పెట్టి మరీ సేవలు అందించారని కొనియాడారు. వైద్యారోగ్యం, బ్యాంకింగ్‌, అగ్నిమాపక సిబ్బంది అద్భుతంగా సేవలు అందించించిందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కితాబిచ్చారు. బడ్జెట్ 2021(Union Budget 2021 Latest Budget)లో కరోనా వ్యాక్సిన్‌ కోసం రూ.35 వేల కోట్లు కేటాయించారు. మన దేశంలో పాటు మరో 100 దేశాలకు సైతం భారత్ వ్యాక్సిన్‌ అందిస్తుందని పేర్కొన్నారు. 

Also Read: Budget Expectations 2021: బడ్దెట్‌లో దేనికి ప్రాధాన్యత..నిర్మలా సీతారామన్ ఏమన్నారు

కరోనా లాంటి మహమ్మారిలను ఎదుర్కొనేందుకు దేశంలో మరో నాలుగు ప్రాంతీయ వైరల్‌ ల్యాబ్‌ల ఏర్పాటుకు నిర్ణయం తీసుకున్నారు. జాతీయ స్థాయిలో వ్యాధి నివారణ కేంద్రం, 15 ఎమర్జెన్సీ వెల్‌నెస్‌ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నారు. పట్టణాల్లో నీటి సమస్య పరిష్కారానికి జల్‌ జీవన్‌ అభియాన్‌ స్కీమ్‌ను తమ ప్రభుత్వం తీసుకొస్తుందని చెప్పారు.

Also Read: Union Budget 2021 Live Updates: నేడు కీలక బడ్జెట్ ప్రవేశపెట్టనున్న Nirmala Sitaram

 

కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆత్మ నిర్భర్‌ భారత్‌ ప్రోత్సాహకాల్లో భాగంగా రూ.1.97 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఆత్మనిర్భర్‌ ఆరోగ్య పథకానికి తాజా బడ్జెట్ 2021-22లో రూ.2,23,846 కోట్లు కేటాయించి, తద్వారా అన్ని జిల్లాల్లో సమీకృత వ్యాధి నిర్థారణ కేంద్రాలు సిద్ధం చేయనున్నట్లు నిర్మలా సీతారామన్(Nirmala Sitaraman Budget 2021 Speech) ప్రకటించారు.

Also Read: Gold Price Today In Hyderabad: బులియన్ మార్కెట్‌లో నేటి Gold Rates, స్థిరంగా Silver Price
 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు..  క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News