పార్లమెంట్‌లో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి అరుణ్ జైట్లీ అలా బడ్జెట్ ప్రసంగం మొదలుపెట్టారో లేదో అప్పుడే సెన్సెక్స్ 200 పాయింట్స్ పైకి ఎగబాకగా నిఫ్టీ 11,100 వద్ద కొనసాగుతోంది. బడ్జెట్ ప్రకటన మొదలైన కొద్దిసేపట్లోనే వ్యవసాయ ఉత్పత్తుల తయారీ రంగంలోని కంపెనీల షేర్స్ 2 శాతం లాభపడ్డాయి. వ్యవసాయ రంగం సంక్షేమానికి కట్టుబడి వున్న తమ ప్రభుత్వం అన్నదాతల ఉత్పత్తులకి కనీస మద్ధతు ధర అందించేందుకు కృషిచేసే దిశగా చర్యలు చేపట్టినట్టు ప్రకటించడమే అందుకు ఓ కారణం. లాభపడిన షేర్స్ జాబితాలో మహీంద్రా అండ్ మహీంద్రా, ఐచర్ మోటార్స్, హీరో మోటో కార్ప్ లాంటి కంపెనీల షేర్స్ వున్నాయి. అయితే, మార్కెట్‌లో ఈ ట్రెండ్ ఇలాగే కొనసాగుతుందా లేక షేర్స్ పతనం అవుతాయా అనేది అరుణ్ జైట్లీ వెల్లడించే మిగతా అంశాలపైనే ఆధారపడి వుంటుంది.
నేడు కేంద్ర బడ్జెట్ 2018ను ప్రవేశపెట్టిన కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి.. వ్యవసాయరంగాన్ని మరింత బలపర్చడం కోసం రూ.2000 కోట్ల అగ్రిమార్కెట్ ఇన్‌ఫ్రా ఫండ్‌ని ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించారు.