Aadhaar Card Updates: ప్రస్తుతం దేశంలో ప్రతి పనికీ ఆధార్ కార్డు అవసరమౌతోంది. ప్రభుత్వ, ప్రైవేటు పని ఏదైనా ఆధార్ కార్డు అనివార్యంగా మారుతోంది. ఈ క్రమంలో ఆధార్ కార్డు ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్‌గా ఉండాల్సిన అవసరముంది. మరి మీ ఆధార్ కార్డు అప్‌డేట్ ఉందో లేదో తెలుసుకోండి.
ఆధార్ కార్డులో పేరు, జెండర్, చిరునామాలో తప్పులుంటే ఎప్పటికప్పుడు సరి చేసుకోవచ్చు. తరచూ ఇళ్లు మారేవారికి ఆధార్ కార్డు అడ్రస్ మార్చుకోవల్సి వస్తుంటుంది. ఒక్కోసారి ఆధార్ కార్డులో పేరు, జెండర్ తప్పుగా ప్రింట్ కావచ్చు. అందుకే ఆధార్ కార్డును అప్‌డేట్ చేసుకునే అవకాశం కల్పిస్తోంది యూఐడీఏఐ. అయితే ఆధార్‌లో ఈ మార్పులు ఎన్ని సార్లు చేయవచ్చనేది మీకు తెలుసా. ఎలా మార్చుకోవాలి. ఆ వివరాలు ఇప్పుడు పరిశీలిద్దాం.
ఆధార్ కార్డులో పేరును గరిష్టంగా రెండు సార్లు మార్చుకోవచ్చు. పుట్టిన తేదీ, జెండర్ ఒకసారే మార్చుకోవచ్చు. అయితే అడ్రస్ మాత్రం ఎన్ని సార్లు అయినా మార్చుకోవచ్చు. దీనికి లిమిట్ లేదు. సరైన ప్రూఫ్ సమర్పించడం ద్వారా ఆన్‌లైన్ విధానంలో అడ్రస్ మార్చుకోవచ్చు. అంటే ఎలక్ట్రిసిటీ బిల్, టెలీఫోన్ బిల్, వాటర్ బిల్, రెంటల్ అగ్రిమెంట్ ఇలా ఏదైనా సమర్పించవచ్చు.
పెళ్లయిన తరువాత మహిళలకు ఇంటి పేరు మారుతుంటుంది. ఈ పరిస్థితుల్లో ఆధార్ కార్డులో కరెక్షన్ చేయించుకోవల్సి ఉంటుంది. దీనికోసం ఆధార్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్‌కు వెళ్లి అక్కడ ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. మేరేజ్ సర్టిఫికేట్ ఇతర అవసరమైన డాక్యుమెంట్లు సమర్పించాలి. అన్నీ సబ్మిట్ చేసిన తరువాత మీకొక రిసీప్ట్ వస్తుంది. ఈ రిసీప్ట్ ఆధారంగా ఆధార్ కార్డ్ స్టేటస్ చెక్ చేసుకోవచ్చు.
ఇక పుట్టిన తేదీ, అడ్రస్ మార్చుకోవడం కూడా ఇదే ప్రక్రియ. సమీపంలోని ఆధార్ కేంద్రానికి వెళ్లి ఫామ్ ఫిల్ చేసి ఇవ్వాలి. ప్రూఫ్ కోసం పాన్ కార్డు బర్త్ సర్టిఫికేట్, బ్యాంక్ పాస్‌బుక్, పాస్ పోర్ట్, ఓటర్ ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పెన్షనర్ కార్డు, ప్రాపర్టీ ట్యాక్స్ రిసీప్ట్, ఇన్సూరెన్స్ పాలసీ, వాటర్ బిల్, కరెంట్ బిల్ ఇలా ఏదో ఒకటి సమర్పించాలి.
Also read: Jio New Recharge Plans: జియో నుంచి కొత్త రీఛార్జ్ ప్లాన్స్, 200 రూపాయల్లోపే
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook
Aadhaar Card Updates: ఆధార్ కార్డులో పేరు, అడ్రస్, జెండర్ ఎన్ని సార్లు ఎలా మార్చాలి