ఐదేళ్లలోపు చిన్నారులందరికీ 'బాల ఆధార్'

విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఎఐ) ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ 'బాల ఆధార్' కార్డులను ప్రవేశపెట్టింది.

Last Updated : Feb 27, 2018, 01:58 PM IST
ఐదేళ్లలోపు చిన్నారులందరికీ 'బాల ఆధార్'

విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యుఐడీఎఐ) ఐదేళ్లలోపు వయసున్న చిన్నారులందరికీ 'బాల ఆధార్' కార్డులను ప్రవేశపెట్టింది. నీలిరంగు 'బాల ఆధార్' కార్డు పొందేందుకు ఎటువంటి బయోమెట్రిక్ వివరాలు ఇవాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది.   

 

'ఐదేళ్ల వరకు పిల్లలు ఎటువంటి బయోమెట్రిక్ వివరాలు ఇవ్వకుండా నీలి రంగులో ఉండే 'బాల ఆధార్' ను పొందవచ్చు. అయితే ఐదేళ్లు దాటిన తరువాత మాత్రం తప్పకుండా బయోమెట్రిక్ వివరాలు ఇవ్వాలి' అని యుఐడీఎఐ ఉత్తర్వుల్లో పేర్కొంది. పిల్లవాడికి ఐదేళ్లు నిండిన తరువాత, తల్లితండ్రులు ఆ చిన్నారిని సమీప ఆధార్ కేంద్రానికి తీసుకెళ్లి ఉచితంగా బయోమెట్రిక్ వివరాలు నమోదుచేయాలని  తెలిపింది. ఆధార్ ఎన్రోల్మెంట్ కోసం చిన్నారి గుర్తింపు కార్డు(స్కూల్ ఐడీ)ను వెంట తీసుకువెళ్లాలని సూచించింది. 'బాల ఆధార్' నమోదు, సాధారణ ఆధార్ కార్డు నమోదు ప్రక్రియ మాదిరే ఉంటుంది. ఆ వయసులో వారికి ఆధార్ తప్పనిసరేమీ కాదు. కానీ ప్రభుత్వ స్కాలర్ షిప్లు, విద్యావకాశాలు లాంటి పొందేందుకు ఉపయోగపడుతుంది అని వెల్లడించింది. 

 

Trending News