Tradition: ప్రపంచంలో వింతవింత గాధలుంటాయి. అలాగే ఆ ఊర్లో ఓ వింత పద్ధతి అమల్లో ఉంది. చెప్పులు, షూలు అక్కడ నిషేధం. ఉల్లంఘిస్తే కఠిన చర్యలే. ఇంతకీ ఆ ఊరేంటి..ఆ కధేంటి.
ప్రపంచంలో ఏదో మూల మనకు తెలియని చాలా వింతలు విచిత్రాలుంటాయి. కొన్నిచోట్ల వింత పద్ధతులు,వ్యవహారాలుంటాయి. చెప్పులు గానీ..షూస్ గానీ లేకుండా అటూ ఇటూ మనం తిరగగలమా. కానీ ఆ ఊర్లో పద్ధతే వేరు. అక్కడి జనం పొరపాటున కూడా చెప్పులు, షూస్ వేసుకోరు. అలా వేసుకునేవారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తారు కూడా. ఎందుకీ పద్థతి..ఏ ఊర్లో ఇలా జరుగుతుందో తెలుసుకుందాం.
ఇది దక్షిణాది సాంప్రదాయమే. తమిళనాడు ( Tamil nadu ) లోని మధురై ( Madhurai )కు దాదాపు 20 కిలోమీటర్ల తూరంలో ఉన్న కలిమాయన్ ఊరు ( Kalimayan village ) పరిస్థితి ఇది. ఈ ఊర్లో చెప్పులు గానీ షూ గానీ ధరించడం నిషేధం. ఈ ఊర్లో ఏళ్ల తరబడి నుంచి ఈ ఆచారం అమల్లో ఉంది. ఇక్కడి ప్రజలు చెప్పులు వేసుకోరు. షూస్ ధరించరు. పెద్దలే కాదు పిల్లలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుంది. ఒకవేళ పొరపాటునైనా ఎవరైనా చెప్పులు వేసుకున్నా..షూ ధరించినా కఠిన శిక్ష తప్పదు.
విచిత్రమైన సాంప్రదాయమైన లాజిక్ కూడా విచిత్రమే
ఈ ఊర్లో ఈ విచిత్రమైన సాంప్రదాయం ( Tradition ) వెనుక ప్రత్యేక కారణముంది. చెప్పులు, షూస్ ధరించడం వెనుక వీరి లాజిక్ ప్రత్యేకంగా ఉంది. వాస్తవానికి ఈ ఊరి ప్రజలు అనాది నుంచి అపాచ్చీ అనే దేవతను పూజిస్తున్నారు. అపాచ్చీ దేవతే తమను రక్షిస్తుందనేది ఊరి ప్రజల నమ్మకం. తమ దేవతపై అపార నమ్మకంతో ఈ ఊరి సరిహద్దుల్నించి లోపలకు చెప్పులు, షూ ధరించడం నిషేధించారు.
శతాబ్దాల నుంచి ఈ వింత ఆచారాన్ని పాటిస్తూ వస్తున్నారు ఊరి ప్రజలు. ఇక్కడి ప్రజలు ఒకవేళ బయటి ఊర్లకు వెళ్లాలనుకుంటే చెప్పులు చేత పట్టుకుని వెళ్తారు. ఊరు దాటాక వేసుకుంటారు. తిరిగొచ్చేటప్పుడు ఊరి పొలిమేరల్లో చెప్పులు చేత పట్టుకుని వస్తారు. ఈ పరంపర అనాదిగా జరుగుతూ వస్తోంది. అదే కొనసాగుతోంది.
Also read: Ayodhya new mosque: అయోధ్యలో కళ్లు చెదిరే రీతిలో కొత్త మసీదు..ఆసుపత్రి డిజైన్