నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటన

భాగ్యనగరం హైదరాబాద్ లో నేడు ప్రధాని మోడీ పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మెట్రో రైలు ప్రారంభిస్తారు. అనంతరం ఆయన ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ప్రారంభిస్తారు.

Last Updated : Nov 28, 2017, 01:31 PM IST
నేడు ప్రధాని మోడీ హైదరాబాద్ లో పర్యటన

ప్రధాని మోడీ మంగవారం హైదరాబాద్ లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన మధ్యాహ్నం1:10కి బేంగపేట ఎయిర్ పోర్టుకు చేసుకుంటారు. ప్రధానికి గవర్నర్ నరసింహన్, తెలంగాణ సీఎం కేసీఆర్ స్వాగతం పలకనున్నారు. బేగంపేట విమానాశ్రయంలో చేరుకోగానే బీజేపీ నేతలతో మోడీ ప్రత్యేకంగా భేటీ అవుతారు. అనంతరం మహ్నాహ్నం 1:45కి హెలికాఫ్టర్ ద్వారా మియాపూర్ కు చేరుకుంటారు.  మియాపూర్ మెట్రో స్టేషన్ వద్ద హెచ్ఎంఆర్  పైలాన్ ఆవిష్కరిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2;15కి ప్రధాని మోడీ మెట్రో రైలును ప్రారంభిస్తారు. ఈ సందర్భంగా హైదాబాద్ మెట్రోను ప్రధాని మోడీ జాతికి అంకితం చేస్తారు

మెట్రో రైల్లో ప్రధాని ప్రయాణం...

మెట్రో రైలును ప్రారంభించిన అనంతరం  మియాపూర్ నుంచి కూకట్ పల్లి వరకు..మరల  కూకట్ పల్లి నుంచి మియాపూర్ వరకు మెట్రో  రైల్లో ప్రధాని మోడీ ప్రయాణిస్తారు.  అనంతరం మధ్యాహ్నం 2:55కి మియాపూర్ నుంచి హెచ్ఐసీసీకి వెళ్తారు..మధ్యాహ్నం 3.25 హెచ్ఐసీసీకి చేరుకోంటారు. ఈ సందర్భంగా హెచ్ఐసీసీలో అమెరికా ప్రభుత్వ సలహాదారు ఇవాంక ట్రంప్ తో 20 నిమిషాలతో భేటీ అవుతారు. అనంతరం ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సును ప్రారంభిస్తారు. సాయంత్రం ఇవాంక ట్రంప్ తో పాటు సదస్సుకు హాజరైన ప్రతినిధులకు పలక్ నుమా ప్యాలెస్ లో ప్రధాని మోడీ విందు ఇస్తారు. విందు కార్యక్రమం పూర్తయిన తర్వాతే అంటే  రాత్రి 10 గంటలకు రాజ్ కోట్ పయనమై రాత్రి అక్కడే బస చేస్తారు ప్రధాని మోడీ.

Trending News