గత రెండు రోజులుగా పడిపోయిన బంగారం ధరలు భగభగలాడుతున్నాయి. బుధవారం నాడు బులియన్ మార్కెట్లో పసిడి ధరలు పెరిగాయి. దీంతో బంగారం కొనుగోలు చేయాలనుకున్న వారికి కాస్త ఇబ్బంది ఏర్పడుతుంది. బంగారం ధరలు పెరిగినా.. వెండి ధరలు మాత్రం తగ్గడం విశేషం. మార్కెట్లో పసిడి ధరలు కాస్త తగ్గుతున్నా.. కొనుగోలుదారులు, దేశీయ వ్యాపారుల నుంచి భారీగా డిమాండ్ రావడంతో రెండు రోజుల తర్వాత పసిడి ధర పరుగులు పెడుతోంది.
Also Read: 2నిమిషాల్లో పాన్ కార్డ్, ఆధార్ ఇలా లింక్ చేసుకోండి
మార్చి 11న హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధర స్వల్పంగా పెరిగింది. 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.180 మేర తగ్గి రూ.45,980కు చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర సైతం రూ.180 పెరగడంతో 10 గ్రాముల పసిడి ధర రూ.42,160 అయింది. దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర 44,050 వద్ద కొనసాగుతుండగా.. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.42,850గా ఉంది.
బీ అలర్ట్: WhatsAppలో ఈ10 తప్పులు చేస్తున్నారా?
బంగారం ధర పరుగులు పెట్టినా వెండిధర మాత్రం నేలచూపులు చూస్తోంది. ధర రూ.1000 రూపాయలు తగ్గడంతో 1 కేజీ వెండి ధర రూ.48,500కు క్షీణించింది. స్థానిక మార్కెట్లలో బంగారానికి ఉన్న డిమాండ్ వెండికి లేకపోవడంతో వెండి ధరలు తగ్గాయి. రెండు రోజుల కిందట ఔన్స్ బంగారం ధర 1702 డాలర్లుండగా.. నేడు ధర 1657 డాలర్లకు తగ్గింది. దేశీయంగా వెండి ధర తగ్గినా, అంతర్జాతీయంగా మాత్రం ధరలు పెరిగాయి. వెండి ధర 0.49 శాతం పెరిగడంతో ఔన్స్ ధర 17 డాలర్లు అయింది. కాగా, గత రెండు నెలలుగా కరోనా వైరస్ బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది.
See Pics: టాలీవుడ్‌కు ఎంట్రీ ఇవ్వక ముందే మోడల్ రచ్చ రచ్చ