బంగారం ధరలు పైపైకి.. పతనమైన వెండి ధరలు

బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధరలు పెరగగా, 22 క్యారెట్ల ధరలతో పాటు వెండి ధరలు క్షీణించాయి.

Written by - Shankar Dukanam | Last Updated : Apr 30, 2020, 06:15 AM IST
బంగారం ధరలు పైపైకి.. పతనమైన వెండి ధరలు

బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం ధరలు మిశ్రమంగా ఉన్నాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధరలు పెరగగా, 22 క్యారెట్ల ధరలతో పాటు వెండి ధరలు క్షీణించాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయ అంశాలు బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతాయని తెలిసిందే. కరోనా 6 కొత్త లక్షణాలు..మీకు తెలుసా!

హైదరాబాద్‌, విశాఖ, విజయవాడ మార్కెట్లలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.100 పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.47,000కి చేరుకుంది. నిన్న రూ.2,120 పెరిగిన 22 క్యారెట్ల ధర నేడు రూ.500 మేర పతనమైంది. దీంతో 10 గ్రాముల ధర రూ.44,240కి దిగొచ్చింది.  Photos: పెళ్లి తర్వాత నటి గ్లామర్ షో!

నేడు ఢిల్లీ మార్కెట్‌లోనూ బంగారం ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల బంగారం ధర రూ.600 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.48,250కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం ధర రూ.1,000 పెరిగింది. దీంతో 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.46.150 వద్ద ర్యాలీ అవుతోంది.

గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన వెండి ధరలు నేడు వరుసగా రెండో రోజు దిగొచ్చాయి. నిన్న మార్కెట్‌లో రూ.400 మేర తగ్గిన 1కేజీ వెండి ధర తగ నేడు మరో రూ.700 దిగొచ్చింది. దీంతో కిలో వెండి ధర రూ.41,500కి క్షీణించింది. ఢిల్లీతో పాటు దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది.   జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Photos: నీ కాళ్లను పట్టుకుని వదలనన్నవి చూడే నా కళ్లు!

 ‘అల వైకుంఠపురములో’ భామ Hot Photos

Trending News