బులియన్ మార్కెట్‌లో నేడు బంగారం, వెండి ధరలు స్వల్పంగా పెరిగాయి. కొనుగోళ్లు పెరగడంతో వరుసగా మూడోరోజు ధరలు పెరిగాయి. స్థానిక జ్యువెలర్ల వద్ద విక్రయాలు, సెంట్రల్ బ్యాంకులో బంగారం నిల్వలు, దేశీయ మార్కెట్‌లో డిమాండ్, అంతర్జాతీయంగా డాలర్ మారకం ధర, పలు అంశాలు బంగారం, వెండి ధరల (Gold Price Today)పై ప్రభావం చూపుతాయని తెలిసిందే.
హైదరాబాద్, విశాఖ, విజయవాడ మార్కెట్లలో నిన్న మార్కెట్‌లో రూ.140 మేర పెరిగింది. దీంతో 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.46,550కి చేరుకుంది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.43,750 వద్ద ట్రేడ్ అవుతోంది. చైతూ లవ్ స్టోరీలో సమంత జోక్యం చేసుకోలేదు!
గత కొన్ని రోజులుగా ఢిల్లీ మార్కెట్‌లో అనిశ్చితి కొనసాగుతోంది. నేడు బంగారం ధర భారీగా తగ్గింది. ఢిల్లీ మార్కెట్లో రూ.700 మేర ధర దిగొచ్చింది. దీంతో 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం 10 గ్రాముల ధర రూ.46,310కి క్షీణించింది. 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.44,560కి దిగొచ్చింది. బికినీలో బ్యూటీలు.. సమ్మర్ మరింత హాట్!
ఈ నెల తొలిరోజు దిగొచ్చిన వెండి ధరలు తర్వాత రోజు నుంచి ర్యాలీ అవుతున్నాయి. వెండి కేజీపై నేడు రూ.290 మేర పెరిగింది. దీంతో కిలో వెండి ధర రూ.41,500కి ఎగసింది. దేశ వ్యాప్తంగా వెండి అదే ధర వద్ద కొనసాగుతోంది. జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here..
క్యాలెండర్ గాళ్ అందాలు చూడతరమా!