Arunachal Pradesh river turns black, thousands of fish die: మంచి నీటితో పరవళ్లు తొక్కే నది..ఆకస్మాత్తుగా నల్లగా మారింది. దీంతో వేలాది చేపలు(Fish) మృత్యువాతపడ్డాయి. ఈ ఘటన అరుణాచల్ ప్రదేశ్(Arunachal Pradesh) రాష్ట్రంలోని కమెంగ్ జిల్లాలో జరిగింది. మరి ఈ నదిలోని నీరంతా విషమయం కావడానికి కారణమెవరో తెలుసా.. మన పొరుగు దేశమైన చైనా!.
వివరాల్లోకి వెళితే..
అరుణాచల్ ప్రదేశ్‌లోని సెప్పా(Seppa) వద్ద శుక్రవారం నదిలో వేల సంఖ్యలో చేపలు చనిపోయాయని జిల్లా మత్స్య అభివృద్ధి అధికారి (డీఎఫ్‌డీవో) హాలి తాజో తెలిపారు. ప్రాథమిక పరిశోధనల ప్రకారం, మరణాలకు కారణం నదిలోని నీళ్లలో టీడీఎస్ అధిక శాతం ఉండడం వల్లే ఇలా జరిగిందని తెలిపారు. నది నీటిలో అధిక టీడీఎస్ (total dissolved substances (TDS) ఉన్నందున, చేపలు ఆక్సిజన్‌ను పీల్చుకోవడం కష్టంగా మారుతుందని దీని కారణంగా అవి చనిపోయినట్లు ధృవీకరించారు. ప్రస్తుతం ఆ నదిలో టీడీఎస్ లీటరుకు 6,800 మిల్లీగ్రాములుగా ఉంది.
Also read: Delhis air quality: దీపావళికి ముందే ఢిల్లీలో తీవ్ర వాయు కాలుష్యం
సాధారణంగా నీటిలో ఒక లీటరుకు 300-1,200 మిల్లీగ్రాముల ఉంటుంది. తూర్పు కమెంగ్ జిల్లా (East Kameng district) యంత్రాంగం కామెంగ్ నది(Kameng river)కి సమీపంలో చేపలు పట్టేందుకు వెళ్లవద్దని, చనిపోయిన చేపలను విక్రయించవద్దని ఉత్తర్వులు జారీ చేసింది. నదిలో టీడీఎస్ పెరగడానికి చైనా(China) కారణమని సెప్పా ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు. డ్రాగన్ దేశం చేస్తున్న భారీ నిర్మాణ కార్యకలాపాల వల్ల నీటి రంగు నల్ల(Black)గా మారిందని ఆరోపించారు. కమెంగ్ నది నీటి రంగు ఆకస్మికంగా మారడం, పెద్ద మొత్తంలో చేపలు చనిపోవడం వెనుక కారణాన్ని తెలుసుకోవడానికి వెంటనే నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని సెప్పా తూర్పు ఎమ్మెల్యే తపుక్ టాకు రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook