Thief Fires Bike: చలి మంట కాగేందుకు.. ఏకంగా బైక్‌నే తగలబెట్టిన దొంగ!!

ఓ దొంగ మాత్రం చలి మంట కాగేందుకు ఏకంగా బైక్‌నే తగబెట్టాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. 

Written by - ZH Telugu Desk | Last Updated : Dec 25, 2021, 04:17 PM IST
  • చలి మంట కాగేందుకు బైక్‌నే తగలబెట్టిన దొంగ
  • బైక్‌ను తగలబెట్టి చలి మంట కాచుకున్న దొంగ
  • 10 బైక్‌లను దొంగిలించిన దొంగ
Thief Fires Bike: చలి మంట కాగేందుకు.. ఏకంగా బైక్‌నే తగలబెట్టిన దొంగ!!

Thief fires bike in Nagpur to protect him self from Cold Weather: సాధారణంగా శీతాకాలంలో చలి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా ఉదయం వేళ. చలిని తట్టుకునేందుకు ప్రజలు ఉదయాన్నే చలి (Cold Weather) మంటలు వేస్తారు. చలి మంట కాగేందుకు అందరూ కర్రలను ఉపయోగిస్తారు. ఒక్కోసారి పేపర్స్, టైర్స్ వంటివి కూడా వాడుతారు. అయితే ఓ దొంగ (Thief ) మాత్రం చలి మంట కాగేందుకు ఏకంగా బైక్‌ (Bike)నే తగబెట్టాడు. మహారాష్ట్రలోని నాగపూర్‌ (Nagpur)లో చోటు చేసుకున్న ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. సదరు దొంగపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అసలు విషయంలోకి వెళితే...

నాగపూర్‌ సిటీలోని యశోదరా నగర్ ప్రాంతంలో గత కొంత కాలంగా చాలా బైక్‌లు రాత్రికి రాత్రే కనబడకుండా పోయాయి. బైక్‌లు అన్ని చోరికి గురయ్యాయనే అనుమానంతో.. పలువురు వాహనాదారులు సిద్దార్థ్ నగర్‌లో ఉన్న పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో ఓ ముఠాను సిద్దార్థ్ నగర్‌ పోలీసులు అరెస్టు చేశారు. ప్రధాన నిందితుడు అయిన చోటా సర్ఫరాజ్‌తో పాటు అతని నలుగురు అనుచరులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. 

Also Read: BSNL 5GB Data Plan: బీఎస్ఎన్ఎల్ బంపర్ ఆఫర్.. అతి తక్కువ ధరకే 5 జీబీ డైలీ డేటా!!

పోలీసుల విచారణలో చోటా సర్ఫరాజ్‌కు చెందిన ముఠా మొత్తంగా 10 బైక్‌ (Bike)లను దొంగిలించినట్టు తేలింది. దొంగిలించిన 10 బైక్‌లలో  తొమ్మిదింటిని పోలీసులు రికవరీ చేశారు. అయితే 10వ బైక్ ఆచూకి మాత్రం తెలియరాలేదు. ఆ బైక్ గురించి చోటా సర్ఫరాజ్‌ను ప్రశ్నించగా.. అతడు చెప్పిన సమాధానంతో పోలీసులు ఆశ్చర్యపోయారు. ఇటీవల చలి ఎక్కువగా ఉండడంతో.. చలి మంట కాచుకునేందుకు ఆ బైకుకు తగబెట్టానని (Thief Fires Bike) సర్ఫరాజ్‌ చెప్పాడు. ఇది విన్న పోలీసులు అతడికి బడతపూజ చేశారు. సర్ఫరాజ్‌ చెప్పిన చోటుకు వెళ్లి చూడగా.. అక్కడ బైక్ పూర్తిగా కాలిపోయి ఉంది. దాంతో చోటా సర్ఫరాజ్‌ ముఠాపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. 

Also Read: Harbhajan Singh: రాజకీయాల్లోకి ఎంట్రీపై హర్భజన్ సింగ్ క్లారిటీ- సిద్ధూను కలిసింది ఎందుకంటే?

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News