దేశ ప్రజలు గతం కంటే భారీ మెజార్టీ ఇచ్చి మోడీ టీం కు రెండో సారి అధికారం కట్టబెట్టారు. దీంతో సహజంగానే ఈ సారీ మోడీ సర్కార్ పై భారీ అంచనాలు ఉన్నాయి. జనాల అంచనాలకు అనుగుణంగాబడ్జెట్ను ప్రవేశపెట్టేందుకు ప్రయత్నించారు ఆర్ధికమంత్రి నిర్మాల సీతారామన్. ఈ క్రమంలో అభివృద్ధి అంశాలతో పాటు సామాన్యులకు ఆకట్టుకనేలా సంక్షేమ కార్యక్రమాలను పొందుపరిచి ఈ రోజు కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ లోక్‌సభలో బడ్జెట్-2019ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆర్ధిక మంత్రి బడ్జెట్ 2019 లో అనేక అంశాలను ప్రస్తావించారు. ఆమె ప్రసంగంలోని ముఖ్యంశాలను ఒక్కసారి పరిశీలిద్దాం..
* పన్నుల విధానంలో మరింత పారదర్శకత
* వ్యక్తిగత ఆదాయపు పన్ను పరిమితిలో ఎలాంటి మార్పులు లేవు
* రూ. 5లక్షల వరకు ఆదాయానికి ఎలాంటి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు.
* ఐదు కోట్ల కంటే ఎక్కువ వార్షిక ఆదాయం కలిగిన వారిపై సర్‌ఛార్జీ పెంపు
* కార్పొరేట్ ట్యాక్స్ పరిధి రూ.400 కోట్లకు పెంపు
* స్వయం సహాయ బృందాలకు కూడా ముద్ర యోజన వర్తింపు
* ప్రతి స్వయం సహాయ బృందంలో ఒకరికి రూ.లక్ష వరకు ముద్ర రుణం
* అందరికీ ఇళ్ల కల్పించే లక్ష్యంతో 1.9 కోట్ల నివాసాల నిర్మాణం
* ఇళ్ల నుంచి వచ్చే నీటిని తిరిగి సాగుకు యోగ్యంగా మలిచేందుకు ప్రత్యేక పథకం.
* జల్‌శక్తి అభియాన్ పథకం ద్వారా 256 జిల్లాల్లో సాగుకు నీరు
* ప్రధానమంత్రి డిజిటల్ సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ
* అపరిచిత నగదు జమ నియంత్రణకు ప్రత్యేక విధానం
* డీజిల్, పెట్రోల్‌పై ఎక్సైజ్ సుంకం రూ.1 పెంపు
* బంగారంపై కస్టమ్స్ సుంకం 10 నుంచి 12.50 శాతానికి పెంపు
* దేశంలో నాలుగు కార్మిక న్యాయస్థానాల ఏర్పాటు
* దేశంలో 1.25 లక్షల కి.మీ. మేర రహదారుల ఆధునికీకరణ
* విద్యుత్ వాహనాలపై జీఎస్టీని 12శాతం నుంచి 5శాతానికి తెచ్చే యోచన
* దేశంలో మెగా మ్యానుఫ్యాక్చరింగ్ జోన్ల ఏర్పాటు
* బ్యాటరీ, సౌరశక్తి రంగంలో విదేశీ కంపెనీలకు అనుమతి
* సోషల్ ఎంటర్‌ప్రైజెస్ చేయూతకు ఎలక్ట్రానిక్ విధానంలో నిధుల సేకరణ
* ఉజాల యోజన ద్వారా దేశవ్యాప్తంగా 35 కోట్ల ఎల్‌ఈడీ బల్బులు పంపిణీ.
* ఎల్‌ఈడీ వాడకంతో రూ.80వేల కోట్ల విలువైన విద్యుత్ ఆదా
* భారత పాస్‌పోర్టు కలిగిన ఎన్‌ఆర్‌ఐలకు ఆధార్‌కార్డులు
* భారత రాయబార కార్యాలయం లేని దేశాల్లో నూతన రాయబార కార్యాలయాల ఏర్పాటు.
*బసవేశ్వరుని బోధనల ప్రభావంపై యువతకు శిక్షణ కార్యక్రమం.
* ఖేల్ ఇండియాలో భాగంగా క్రీడలకు ప్రోత్సాహం.
* స్టార్టప్‌ల కోసం దూరదర్శన్‌లో ప్రత్యేకంగా కొత్త ఛానల్ ఏర్పాటు
* పట్టణీకరణ కోసం ప్రత్యేక ప్రణాళికలు
* స్టాండప్ ఇండియా పథకంతో వెనుకబడిన వర్గాల యువతకు శిక్షణ
* రూ.1,రూ.2,రూ.5,రూ.10,రూ.20 కొత్త నాణేల ముద్రణ
* 4లక్షల కోట్ల మొండి బకాయిల వసూళ్ల కోసం కఠిన చట్టాలు
* సాక్షరత యోజన ద్వారా 2 కోట్లమంది గ్రామీణ యువతకు శిక్షణ
* ప్రభుత్వ రంగ సంస్థల నుంచి రూ. లక్షా ఐదు వేల కోట్ల ఉపసంహరణ
* మహిళల అభివృద్ధికి ప్రత్యేక పథకాలు
* జన్‌ధన్ ఖాతా కలిగిన మహిళలకు రూ.5వేలు ఓవర్ డ్రాఫ్ట్ సౌకర్యం
* ఆన్‌లైన్ పర్సనల్ లోన్స్, మీ ఇంటి ముందుకే బ్యాంకు సేవలు
* దేశవ్యాప్తంగా విదేశీ పర్యాటకులను ఆకర్షించేందుకు మరిన్ని సౌకర్యాలు
* దేశంలోని 17 పర్యాటక కేంద్రాల్లో ప్రపంచస్థాయి సౌకర్యాల ఏర్పాటు
* ఆదివాసీలకు సంబంధించిన నృత్య, కళా, సాంస్కృతిక రూపకాలను డిజిటలైజ్
* జాతీయ పరిశోధనా మండలి కింద ఎన్నికైన పరిశోధనలకు ఆర్థిక సాయం
* పాఠశాల విద్య, ఉన్నత విద్యా రంగాల్లో సంస్కరణలు.
* మత్స్యకారుల కోసం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన
* నగరాలు, పట్టణాలు, గ్రామాలను టెక్నాలజీతో అనుసంధానం
* ‘జలశక్తి మంత్రిత్వశాఖ’ ఏర్పాటు. అన్ని నీటి వనరుల నిర్వహణ
* ‘హర్ ఘర్ జల్’ పథకంలో భాగంగా నివాసాలకు నీటి సరఫరా.
* జీరో బడ్జెట్ వ్యవసాయం (పెట్టుబడులు లేకుండా వ్యవసాయం)
* 2022 నాటికి అన్ని నివాసాలకు విద్యుత్, గ్యాస్ సరఫరా
* ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం
* మీడియా, యానిమేషన్, విమానయాన రంగంలో ఎఫ్‌డీఐలపై పరిశీలన.
* సామాన్యులకు అందుబాటులోకి ఉండేలా ఆదర్శ అద్దె విధానం
*ఎంఎస్‌ఎంఈలకు రూ.కోటి వరకూ రుణ సదుపాయం
* పట్టణ, గ్రామీణ ప్రాంతాల మధ్య అంతరాలు తగ్గించేందుకు చర్యలు
* బస్ ఛార్జీలు, పార్కింగ్ రుసుములు చెల్లించే విధంగా ఒకే కార్డుకు రూపకల్పన
* మినిమమ్ గవర్నమెంట్, మ్యాగ్జిమమ్ గవర్నన్స్ విధానం
* పరిశ్రమలకు అనుమతుల ప్రక్రియను మరింత సరళతరం
* కర్మయోగి మాన్‌ధన్ యోజన ద్వారా చిల్లర వర్తకులకు పింఛన్ పథకం
* ఎలక్ట్రిక్ వాహనాల సబ్సిడీ కోసం ప్రత్యేక లాబీయింగ్
* ఎఫ్‌డీఐల ఆకర్షణించేందుకు మరింత పారదర్శకమైన ఆర్ధిక వ్యవస్థ
* విదేశీ పెట్టుబడులు ఆకర్షించేందుకు సరికొత్త కొత్త విధానం, రెడ్ టేపిజం నియంత్రణకు చర్యలు
* ఇస్రో సేవలను వాణిజ్యపరంగాను వృద్ధి చేసేందుకు ప్రత్యేక కంపెనీ ఏర్పాటు
* ప్రపంచంలోనే అతి తక్కువ ఖర్చుతో అంతరిక్ష ప్రయోగాలు
* అంతరిక్ష ప్రయోగాల ఉత్పత్తులు, మార్కెటింగ్‌కు ప్రత్యేక వ్యవస్థ ఏర్పాటు