TET Certificate Validity : ఉపాధ్యాయ అర్హత పరీక్ష పాసైన వారికి కేంద్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. టెట్ పాసైన సర్టిఫికేట్ గడువును ఏడేళ్ల నుంచి జీవిత కాలానికి పొడిగించారు. ఈ మేరకు కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ ప్రకటన చేశారు. ఇదివరకే టెట్ ఏడేళ్ల వ్యాలిడిటీ ముగిసిన వారికి కొత్తగా లైఫ్‌టైమ్ సర్టిఫికెట్ ఇవ్వాలని విద్యాశాఖ సూచించింది.
2011 నుంచి టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (Teacher Eligibility Test) సర్టిఫికెట్ పొందిన అభ్యర్థులకు జీవితకాలం అర్హత వర్తించనుందని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ స్పష్టం చేశారు. ఉపాధ్యాయులకు అవకాశాలు పెంపొందించడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుందని పేర్కొన్నారు. నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (National Council for Teacher Education) ప్రకారం ఫిబ్రవరి 11, 2011 నుంచి టెట్ పాసైన వారికి ఏడేళ్ల కాలపరిమితి ఉన్న సర్టిఫికేట్ గడువును జీవితకాలనికి పొడిగిస్తూ (TET certificate validity) కీలక నిర్ణయం తీసుకున్నారు.
Validity period of Teachers Eligibility Test (TET) qualifying certificate has been extended from 7 years to lifetime with retrospective effect from 2011. https://t.co/8IQD3cwRTz (1/2) pic.twitter.com/EGi5IJ2wNu
— Dr. Ramesh Pokhriyal Nishank (@DrRPNishank) June 3, 2021
వాస్తవానికి టీచర్ ఉద్యోగం సంపాదించాలనుకునే వారు కేంద్రం గతంలో జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ పాసవ్వాలి. టెట్ పాసైన ఏడేళ్ల వరకు ప్రభుత్వ ఉద్యోగాలకు అవకాశం ఉంటుంది. అయితే తాజాగా దీనికి కొన్ని సవరణలు చేసింది. ఒక్కసారి ఎవరైనా టెట్ పాసైతే ఆ సర్టిఫికెట్ జీవితకాలం చెల్లుబాటు అయ్యేలా కేంద్ర నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని కేంద్ర విద్యాశాఖ మంత్రి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ (Ramesh Pokhriyal Nishank) తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు కేంద్ర ప్రభుత్వ తాజా మర్గదర్శకాలను పాటించాల్సి ఉంటుంది.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee Hindustan App డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook