KTR ON BJP: బీజేపీ నేతలు సత్య హరిశ్చంద్రుడి బంధువులా? సీబీఐ, ఈడీ దాడులపై కేటీఆర్ సెటైర్..

KTR ON BJP: కేంద్ర ప్రభుత్వంపై దాడి కొనసాగుతున్నారు టీఆర్ఎస్ నేతలు. కొంత కాలంగా మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న గులాబీ పార్టీ నేతలు.. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రతి అంశంలోనూ కేంద్రం తీరును ప్రశ్నిస్తున్నారు

Written by - Srisailam | Last Updated : Jun 11, 2022, 11:59 AM IST
  • టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య డైలాగ్ వార్
  • సీబీఐ,ఈడీ, ఐటీ దాడులపై కేటీఆర్ ట్వీట్
  • బీజేపీ నేతలు సత్య హరిశ్చంద్ర బంధువులా?- కేటీఆర్
KTR ON BJP: బీజేపీ నేతలు సత్య హరిశ్చంద్రుడి బంధువులా? సీబీఐ, ఈడీ దాడులపై కేటీఆర్ సెటైర్..

KTR ON BJP: కేంద్ర ప్రభుత్వంపై దాడి కొనసాగుతున్నారు టీఆర్ఎస్ నేతలు. కొంత కాలంగా మోడీ ప్రభుత్వంపై తీవ్రమైన ఆరోపణలు చేస్తున్న గులాబీ పార్టీ నేతలు.. ఏ ఒక్క చిన్న అవకాశాన్ని వదులుకోవడం లేదు. ప్రతి అంశంలోనూ కేంద్రం తీరును ప్రశ్నిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా బీజేపీ సర్కార్ ను టార్గెట్ చేస్తున్న మంత్రి కేటీఆర్.. తాజాగా మరో ట్వీట్ చేశారు. మోడీ ప్రభుత్వానికి పలు ప్రశ్నలు సంధించారు.

దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇటీవల సీబీఐ, ఈడీ, ఐటీ సోదాలు జరిగాయి. బీజేపీని వ్యతిరేకించే పార్టీల నేతలుపైనే ఎక్కువగా దాడులు జరుగుతున్నాయి. దీనిపైనే మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. బీజేపీ నేతలు, వారి బంధువులుస వాళ్ల సన్నిహితులపై మోడీ ప్రధానమంత్రిగా ఉన్న గత ఎనిమిది ఏళ్లలో ఎన్ని సార్లు సీబీఐ, ఈడీ, ఐటీ దాడులు జరిగాయని తన ట్వీట్ లో ప్రశ్నించారు కేటీఆర్. దాడులు జరగడం లేదంటే బీజేపీ నేతలంతా సత్య హరిశ్చంద్రుడి బంధువులనుకుంటున్నారా? అని కేటీఆర్‌ ప్రశ్నించారు.  

తెలంగాణలో దూకుడుమీదున్న బీజేపీ నేతలు కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. కేంద్ర నిధులను పక్కదారి పట్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. బీజేపీ నేతల ఆరోపణలకు టీఆర్ఎస్ నేతలు కౌంటరిస్తున్నారు. తెలంగాణలో కేంద్రం చేసిందేమి లేదని మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలోనే ఇరు పార్టీల నేతల మధ్య మాటల యుద్ధం సాగుతోంది. మంత్రి కేటీఆర్ వివిధ అంశాలకు సంబంధించి కేంద్రాన్ని ప్రశ్నిస్తూ వరుసగా ట్వీట్లు చేస్తున్నారు. ఇటీవలే కేంద్రంలో ఖాళీగా ఉన్న 16 లక్షల ఉద్యోగాలను భర్తీ చేయాలని డిమాండ్ చేస్తూ ట్వీట్ చేశారు. అంతేకాదు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమయ్యాయని నిలదీస్తూ ప్రధాని నరేంద్ర మోడీకి లేఖ రాశారు సీఎం కేసీఆర్.

Read also: TRS Corporator Attack: కారుతో బైకులను ఢీకొట్టి.. ప్రశ్నించిన ఆడవాళ్లపై దాడి! టీఆర్ఎస్ కార్పొరేటర్ దౌర్జన్యం..

Read also: KCR BRS PARTY: వారంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ.. బీజేపీ, కాంగ్రెస్ ను ఢీకొట్టేనా? మద్దతు ఇచ్చేదెవరు..?       

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి 

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి

 

Trending News