Udayanidhi Stalin: గతంలో హిందూ సనాతన ధర్మాన్ని డెంగ్యూ, మలేరియాతో పోల్చి వివాదానికి తెరతీసిన ఉదయనిధి స్టాలిన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. అయోధ్యలో త్వరలో రామమందిరం ప్రారంభం కానున్న నేపధ్యంలో ఉదయనిధి స్టాలిన్ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడైన ఉదయనిధి స్టాలిన్ ఎప్పుడూ వివాదాస్పద లేదా సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో ఉంటుంటారు. ఈసారి అయోధ్య రామమందిరంపై కీలక వ్యాఖ్యలు చేశారు. రామమందిరంపై డీఎంకే పార్టీ వైఖరేంటనేది స్పష్టం చేశారు. తాము అయోధ్యలో రామమందిర నిర్మాణానికి వ్యతిరేకం కాదని..కానీ మసీదు పడగొట్టి మందిరం నిర్మించడాన్ని వ్యతిరేకిస్తామన్నారు. డీఎంకే పార్టీ కూడా ఏ మతానికి వ్యతిరేకం కాదన్నారు. కరుణానిధి కూడా ఇదే విషయం చెప్పేవారన్నారు. ఆధాత్మికతను రాజకీయాలతో ముడిపెట్టడం మంచిది కాదన్నారు. రామమందిరం నిర్మాణంతో తమకే సమస్య లేదని, ఉన్న సమస్యతంగా మసీదు విధ్వంసం చేసి మందిరం నిర్మించడంపైనేనన్నారు.
గతంలో సనాతన ధర్మం గురించి ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సనాతనాన్ని వ్యతిరేకించడమే కాదు..నిర్మూలించాలని ఉదయనిధి స్టాలిన్ చెప్పారు. డెంగ్యూ, మలేరియా, దోమలు, కరోనా వైరస్‌ను ఏ విధంగా పూర్తిగా రూపమాపాల్సిన అవసరముందో అదే విధంగా సనాతనాన్ని మొత్తం రూపుమాపాలని తెలిపారు.
జనవరి 22వ తేదీన అయోద్య రామమందిరంలో ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమంగా అత్యంత ఘనంగా జరగనుంది. ఈ వేడుకకు ప్రధాని నరేంద్ర మోదీ, యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్, హోంమంత్రి అమిత్ షా వంటి నేతలు పాల్గొననున్నారు. రామమందిరం ప్రారంభోత్సవానికి వివిధ రాజకీయ పార్టీలకు ఆహ్వానం అందింది. కానీ సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, లాలూ ప్రసాద్ యాదవ్, శరద్ పవార్ వంటి నేతలు ఈ ఆహ్వానాన్ని తిరస్కరించారు.
Also read: Ayodhya Rammandir: అయోధ్య రామాలయానికి బంగారం, వెండి చీపుర్లు, ఇవే ప్రత్యేకతలు
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook