COVID-19 positive: చెన్నై: కరోనావైరస్ ( Coronavirus ) ఎవరినీ వదిలిపెట్టడం లేదు. రోజురోజుకు దేశంలో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ( Amit Shah ) సైతం కరోనా బారిన పడ్డారు. ఈ వార్త వెలువడిన కొంత సమయంలోనే మరో వార్త అందరినీ ఆందోళనకు గురిచేసింది. తమిళనాడు గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ( Banwarilal Purohit ) కూడా కరోనా బారిన పడ్డారు. అయితే.. భన్వరీలాల్ చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేరగా.. ఆయనకు కరోనా వైరస్ పాజిటివ్ వచ్చినట్టు ఆసుపత్రి మంగళవారం ప్రకటించింది. Also read: Covid19: కేంద్రమంత్రి అమిత్ షాకు కరోనా పాజిటివ్
ఈ మేరకు గవర్నర్ ఆరోగ్యంపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. వైరస్ ఇన్‌ఫెక్షన్ తక్కువ స్థాయిలోనే ఉందని.. ప్రస్తుతం ఆయన్ను హోం ఐసోలేషన్‌లోనే ఉండాలని వైద్యులు సూచించారు. భన్వరీలాల్‌కు ఎలాంటి లక్షణాలు లేవని, ఆరోగ్యం మెరుగ్గానే ఉందని వైద్యులు తెలిపారు. అంతకు ముందు రాజ్ భవన్‌లో 87 మందికి కరోనా వైరస్ నిర్ధారణ అయిన సంగతి అందరికీ తెలిసిందే. Also read: Covid-19: ఆసుపత్రి నుంచి అమితాబ్ డిశ్చార్జ్
Banwarilal Purohit: తమిళనాడు గవర్నర్‌కు కరోనా