Sukesh Chandrasekhar case-Jacqueline Fernandez: సుకేశ్ చంద్రశేఖర్‌కు సంబంధించిన మనీలాండరింగ్ కేసులో నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు (Jacqueline Fernandez) మరిన్ని చిక్కులు ఎదురయ్యాయి. ఈమెకు చెందిన రూ.7 కోట్ల విలువైన ఆస్తులను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అటాచ్ చేసింది. ఈ కేసులో సుకేశ్ చంద్రశేఖర్, లీనా మరియా పాల్‌తో పాటు మరో 6 పేర్లను ఈడీ ఛార్జ్‌షీట్‌లో చేర్చింది. చంద్రశేఖర్ నుంచి జాక్వెలిన్ ఖరీదైన బహుమతులు తీసుకున్నట్లు ఈడీ విచారణలో తేలింది. ఈ కేసు విచారణలో భాగంగా...ఇప్పటికే పలుమార్లు ఈడీ విచారణకు హాజరైంది జాక్వెలిన్. సుకేశ్ చంద్రశేఖర్ నుంచి కాస్ట్ లీ పూలు, చాక్లెట్లు జాక్వెలిన్ తీసుకున్నట్లు ఈడీ వర్గాలు తెలిపాయి.
రాన్‌బాక్సీ మాజీ ప్రమోటర్లు మల్విందర్ సింగ్, శివిందర్ సింగ్‌లకు Bail ఇప్పిస్తామని నమ్మించి.. వారి భార్యల నుంచి ఏకంగా రూ. 200 కోట్లు వసూలు చేశాడు సుకేశ్ చంద్రశేఖర్ (Sukesh Chandrasekhar). ఆ తర్వాత బెయిల్ విషయాన్ని పట్టించుకోలేదు. దీంతో శివిందర్ సింగ్ భార్య అదితి సింగ్ ఫిర్యాదుకు పోలీసులు కేసు నమోదు చేశారు. గతేడాదిలో ఢిల్లీ పోలీసులు సుకేశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. దిల్లీ ఆర్థిక నేరాల నిరోధక విభాగం(ఈఓడబ్ల్యూ). కేంద్ర న్యాయశాఖలోని ఉన్నతాధికారిగా పరిచయం చేసుకుని సుకేశ్ ఈ మోసానికి పాల్పడినట్లు తెలుస్తోంది. దేశవ్యాప్తంగా సుకేశ్ చంద్రశేఖర్, లీనా పాల్‌పై 23 చీటింగ్ కేసులు ఉన్నాయి.
Also Read: Tarsame Singh Saini Aka Taz: ప్రముఖ బాలీవుడ్ పాప్ సింగర్ తాజ్ కన్నుమూత!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
Twitter , Facebookమా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.
Jacqueline Fernandez: బాలీవుడ్ నటి జాక్వెలిన్ ఫెర్నాండెజ్‌కు ఈడీ షాక్!