Netaji grand statue : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ప్రధాని మోదీ వెల్లడి

PM to unveil hologram statue of Netaji : సుభాశ్ చంద్రబోస్ పోరాట స్ఫూర్తికి చిహ్నంగా ఇండియా గేట్ వ‌ద్ద నేతాజీ విగ్ర‌హం ఏర్పాటుకానుంది. గ్రానైట్‌తో చేసిన నేతాజీ గ్రాండ్ విగ్రహం అక్కడ ఏర్పాటుకాబోతుంది.

Written by - ZH Telugu Desk | Last Updated : Jan 21, 2022, 05:17 PM IST
  • ఇండియా గేట్ వ‌ద్ద నేతాజీ విగ్ర‌హం ఏర్పాటు
  • ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ ట్వీట్
  • గ్రానైట్‌తో చేసిన నేతాజీ గ్రాండ్ విగ్రహం ఏర్పాటు
Netaji grand statue : ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ విగ్రహం, ప్రధాని మోదీ వెల్లడి

Grand Netaji Statue At India Gate : ఢిల్లీలోని ఇండియా గేట్ వ‌ద్ద ప్రముఖ‌ స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ విగ్ర‌హాన్ని ఏర్పాటు చేయ‌నున్న‌ట్లు ప్ర‌ధాన మంత్రి న‌రేంద్ర మోదీ పేర్కొన్నారు. సుభాష్ చంద్రబోస్ 125వ జయంతి నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. గ్రానైట్‌తో చేసిన నేతాజీ గ్రాండ్ విగ్రహాన్ని (Netaji grand statue) ఇండియా గేట్ వ‌ద్ద ఏర్పాటు చేయనున్నట్లు ప్రధాని మోదీ (PM Narendra Modi) తెలిపారు. భారతదేశం ఆయనకు రుణపడి ఉంది అనేందుకు చిహ్నంగా ఈ విగ్రహం నిలువనుంది అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఈ మేరకు ప్రధాని తాజాగా ట్వీట్ చేశారు.

ఇక నేతాజీ విగ్రహాన్ని నిర్మించే వరకు.. ఢిల్లీలోని ఐకానిక్ స్మారక చిహ్నం వద్ద నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని (Netaji Hologram statue) ఉంచుతామని ప్రధాని మోదీ స్పష్టం చేశారు. ఇక జనవరి 23న నేతాజీ జయంతి సందర్భంగా హోలోగ్రామ్ విగ్రహాన్ని మోదీ ఆవిష్కరించనున్నారు. 

కాగా ఇండియా గేట్ వ‌ద్ద ఏర్పాటు చేయ‌నున్న‌ నేతాజీ విగ్ర‌హం 28 అడుగుల ఎత్తు.. 6 అడుగుల వెడ‌ల్పు ఉండనున్నట్లు ప్ర‌భుత్వ వ‌ర్గాలు తెలిపాయి. మ‌రోవైపు నేతాజీ 125వ జయంతి సందర్భంగా ఈ ఏడాది నుంచి గణతంత్ర దినోత్సవ వార్షిక వేడుకలు ప్రారంభమయ్యే తేదీని మార్చారు. జనవరి 24కు బదులుగా జనవరి 23న గణతంత్ర దినోత్సవ వార్షిక వేడుకలు ప్రారంభమవుతాయని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెలిపింది. నేతాజీ జ్ఞాపకార్థం ఏటా జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా పాటిస్తామంటూ కేంద్రం గతేడాది ప్రకటించింది.

Also Read : AP Cabinet: పీఆర్సీ సహా కీలక నిర్ణయాలకు కేబినెట్ ఆమోదముద్ర

ఇక మొదటి ఇండియన్ నేషనల్ ఆర్మీ, ఆజాద్ హింద్ ఫౌజ్‌ను నేతాజీ సుభాశ్ చంద్రబోస్ (Netaji Subhash Chandra Bose) ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే 1943లో ఇండియన్ నేషనల్ ఆర్మీ ఏర్పాటైంది. ఈ ఆర్మీ ఆధ్వర్యంలో బ్రిటిష్ పాలకులపై సాయుధ తిరుగుబాటు సాగింది. స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొనేలా వేలాది మంది భారతీయుల్ని నేతాజీ ప్రేరేపించారు.

Also Read : Bhumika Chawla Swimming: భూమిక బికినీ అందాలు అదరహో.. గ్లామర్ టచ్ మాములుగా లేదుగా!!

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

 

Trending News