SBI Recruitment 2024: బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..

SBI Sportsperson Recruitment 2024:  స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా క్లెరికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.in నోటిఫికేషన్‌ వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలి.

Written by - Renuka Godugu | Last Updated : Jul 26, 2024, 06:19 PM IST
SBI Recruitment 2024: బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐలో ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌.. ఇలా వెంటనే అప్లై చేసుకోండి..

SBI Sportsperson Recruitment 2024: దేశీయ దిగ్గజ బ్యాంక్‌ స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఆసక్తి అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి. నోటిఫికేషన్ వివరాలు తెలుసుకుందాం.

స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్ ఇండియా క్లెరికల్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా 68 పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకునేవారు ఎస్‌బీఐ అధికారిక వెబ్‌సైట్‌ sbi.co.in నోటిఫికేషన్‌ వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలి.

స్పోర్ట్స్‌ కోటాలో భాగంగా ఆఫీసర్స్‌, క్లెరికల్‌ విభాగాల్లో దరఖాస్తులు చేపట్టింది. ఈ నోటిఫికేషన్‌ ద్వారా 68 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. కేవలం ఆన్‌లైన్‌ విధానంలో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి.  ఈ పోస్టుల దరఖాస్తులకు చివరితేదీ ఆగష్టు 14. అధికారిక వెబ్‌సైట్‌ లో ఎస్‌బీఐ స్పోర్ట్స్‌ పర్సన్‌ రిక్రూట్మెంట్‌ 2024 అధికారిక నోటిఫికేషన్ పీడీఎఫ్ అందుబాటులో ఉంది. తద్వారా మీరు డైరెక్ట్ లింక్‌ డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. దరఖాస్తు చేసుకుంటున్న అభ్యర్థులు ముందుగా ఎస్‌బీఐ నోటిఫికేషన్‌కు సంబంధించిన వివరాలు క్షుణ్నంగా పరిశీలించాలి.

ఎస్‌బీఐ స్పోర్ట్స్‌పర్సన్‌ ఖాళీల భర్తీలో భాగంగా నోటిఫికేషన్‌లో ఆఫీసర్‌ పోస్టులు 17, క్లెరికల్‌ పోస్టుు 51 మొత్తం 68 ఖాళీల భర్తీకి చర్యలు చేపట్టింది. అప్లికేషన్‌ ఫీజు ఓబీసీ, ఈడబ్య్లూఎస్‌, యూఆర్‌ రూ.750, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ఏ రుసుము లేదు.

ఇదీ చదవండి: ఆర్‌బీఐలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్‌.. గ్రేడ్‌ B పోస్టులకు దరఖాస్తుల స్వీకరణ

అర్హత..

ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ పూర్తి చేసి ఉండాలి. ఇంటర్నేషనల్‌ లెవల్‌లో ఏదైనా క్రీడల్లో పాల్గొని ఉండాలి.ఇక క్లెరికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు నేషనల్‌ లేదా స్టేట్‌, లేదా యూనివర్శిటీ స్థాయిలో ఏదైనా గేమ్స్‌ పోటీల్లో పాల్గొని ఉండాలి.

ఇదీ చదవండి: ఎల్‌ఐసీ బంపర్‌ ఆఫర్.. ఉద్యోగాల భర్తీకి భారీ నోటిఫికేషన్.. ఈ లింక్‌ ద్వారా నేరుగా అప్లై చేసేయండి..

వయోపరిమితి..
ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21-30 ఏళ్ల మధ్య ఉండాలి.
క్లెరికల్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థుల వయస్సు 21-28 మధ్య ఉండాలి. అధికారిక వెబ్‌సైట్‌ క్షుణ్నంగా పరిశీలించాలి.

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.     

Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu     

Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook

Trending News