ఈ ఏడాది జులై 1 నుంచి మొబైల్ నెంబర్లు 13 అంకెలు ఉండబోతునట్లు టెలికాం శాఖ వర్గాలు వెల్లడించాయి. పెరుగుతున్న మొబైల్ కనెక్షన్ల సంఖ్యలకు వీలుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ప్రస్తుతం ఉన్న 10 నెంబర్లను 13 నెంబర్ల సంఖ్యగా మార్చుకోవడానికి అక్టోబర్ 1, 2018 నుండి డిసెంబర్ 31, 2018గా గడువు పెట్టినట్లు టెలికాం వర్గాలు తెలిపాయి.
దీనిపై బీఎస్ఎన్ఎల్ ఇప్పటికే కసరత్తు చేపట్టింది. 'మాకు ఈ విషయమై టెలికాం శాఖ నుంచి జనవరి 8, 2018న మార్గదర్శకాలు అందాయి. మేము ప్రస్తుతం ఆ పనిలో ఉన్నాము' అని బీఎస్ఎన్ఎల్ అధికారి ఒకరు తెలిపారు. జులైలో మొదలయ్యే ఈ ప్రక్రియ అక్టోబర్ లో పూర్తి స్థాయిలో అమల్లోకి రానుంది. కొత్త, ప్రస్తుత కనెక్షన్ల నెంబర్లు 13కి పెరగుతుండగా.. ఈ మార్పు ఎలా ఉంటుందనే విషయంపై మరింత స్పష్టత రావాల్సి ఉంది.
జులై నుంచి 13 అంకెల మొబైల్ నెంబర్ !