SSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..ఎస్‌ఎస్‌సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

SSC Jobs: నిరుద్యోగ యువతకు ఎస్‌ఎస్‌సీ(స్టాఫ్ సెలక్షన్ కమిషన్) గుడ్ న్యూస్ చెప్పింది. భారీగా ఉద్యోగాలకు భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది.

Written by - Alla Swamy | Last Updated : Sep 26, 2022, 02:44 PM IST
  • నిరుద్యోగులకు శుభవార్త
  • ఎస్‌ఎస్‌సీ నుంచి నోటిఫికేషన్
  • త్వరలో పరీక్షలు
SSC Jobs: నిరుద్యోగులకు గుడ్‌న్యూస్‌..ఎస్‌ఎస్‌సీ నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్..!

SSC Jobs: స్టాఫ్ సెలక్షన్ కమిషన్(SSC) నుంచి ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల అయ్యింది. కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న 20 వేల ఉద్యోగాల భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. గ్రూప్ C పోస్టులకు 18 నుంచి 27 ఏళ్లు, గ్రూప్ బీ పోస్టులకు 18 నుంచి 30 ఏళ్ల లోపు, మిగతా వాటికి 18 నుంచి 32 ఏళ్ల లోపు డిగ్రీ పూర్తైన వారు అర్హులుగా ఉంటారని తెలిపింది. అక్టోబర్ 8 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. అక్టోబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో ఫీజులు చెల్లించాల్సి ఉంటుంది. 

డిసెంబర్‌లో మొదటి విడత పరీక్ష, వచ్చే ఏడాది ఫిబ్రవరిలో రెండో విడత పరీక్షలు ఉండనున్నాయి. మోదీ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోస్టుల భర్తీ మందగించిందన్న విమర్శ ఉంది. దీని నుంచి బయట పడేందుకు బీజేపీ సర్కార్ ప్రయత్నిస్తోంది. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని పోస్టుల భర్తీకి గ్రీన్‌ సిగ్నల్ ఇస్తున్నారు. ఇటీవల భారీగా పోస్టుల భర్తీకి ఆర్థిక శాఖ అనుమతి ఇచ్చింది. ఈనేపథ్యంలో స్టాఫ్‌ సెలక్షన్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.

త్వరలో మరిన్ని నోటిఫికేషన్లు రానున్నాయి. ఎస్‌ఎస్‌సీ ద్వారా భారీగా పోస్టులను భర్తీ చేస్తున్నారు. ఇటీవల ఆర్మీ ఉద్యోగాల భర్తీలోనూ కొత్త సంస్కరణాలు తీసుకొచ్చారు. అగ్నిపథ్‌ పేరుతో కొత్త పథకాన్ని అమలులోకి తెచ్చారు. దీని ద్వారా 18 నుంచి 23 ఏళ్ల లోపు యువతను ఆర్మీలోకి తీసుకోనున్నారు. ఐదేళ్ల సర్వీసులో భారీగా వేతనం ఉండనుంది. రిటైర్డ్మెంట్‌ తర్వాత భారీగా పారితోషికంతోపాటు సర్టిఫికెట్ ఇవ్వనున్నారు. 

దీనిపై పెను దుమారం రేగిన మోదీ ప్రభుత్వం వెనక్కి తగ్గలేదు. అగ్నిపథ్‌ ద్వారానే ఉద్యోగాలను భర్తీ చేస్తున్నారు. అగ్నిపథ్‌లో సేవలు అందించిన వారిలో కొంత మందిని రెగ్యులర్ పోస్టుల్లోకి తీసుకుంటారు. మిగతా వారికి సర్టిఫికెట్‌తోపాటు రిజర్వేషన్ కల్పించనున్నారు. ఇతర పోస్టుల్లో వీరికి అధిక ప్రాధాన్యత ఉండనుంది. 2024 ఎన్నికలలోపు భారీగా నోటిఫికేషన్లు రానున్నట్లు తెలుస్తోంది. ముచ్చట మూడోసారి పవర్‌లోకి బీజేపీ భావిస్తోంది. ఈనేపథ్యంలో భారీగా ఉద్యోగాల మేళా నిర్వహించనున్నారు.

Also Read:అప్పుడు కాకా అన్నారు.. ఇప్పుడేమంటారు యాంటీస్.. కొత్త వాదన తెర మీదకు!

Also Read:హైదరాబాద్‌ ఎంతో ప్రత్యేకం.. గొప్ప జ్ఞాపకాలు ఉన్నాయి: రోహిత్ శర్మ

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

Android Link https://bit.ly/3P3R74U

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి.Twitter , Facebook

Trending News