Heavy Rains: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ప్రస్తుతం షీర్ జోన్ కారణంగా అక్కడక్కడా తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు పడుతున్నాయి. ఈ నెల 15 నుంచి నైరుతి రుతు పవనాలు చురుగ్గా కదలనుండటంతో రెండు తెలుగు రాష్ట్రాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడుతున్నాయి.
నైరుతి రుతు పవనాలు ప్రస్తుతం తెలంగాణలో దాదాపు పూర్తిగా విస్తరించాయి. ఫలితంగా ఇవాళ, రేపు కొన్ని జిల్లాల్లో భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ వెల్లడించింది. ముఖ్యంగా వరంగల్, హన్మకొండ, కొమురం భీమ్ ఆసిపాబాద్, మంచిర్యాల, సిద్ధిపేట, సంగారెడ్డి, జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, మెదక్, జగిత్యాల, పెద్దపల్లి, మహబూబ్ నగర్, రాజన్న సిరిసిల్ల జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయి. వర్షాలతో పాటు ఈదులు గాలులు, ఉరుములు మెరుపులతో వర్షాలు పడనున్నాయి.
అదే సమయంలో నిజామాబాద్, సిద్దిఫేట, సంగారెడ్డి, వరంగల్, కామారెడ్డి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, వికారాబాద్, మెదక్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో మోస్తరు వర్షాలతో పాటు గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీయనున్నాయి. లోతట్టు ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ అధికారులు సూచించారు.
మరోవైపు రుతు పవనాల ప్రభావంతో ఏపీలో కూడా భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ వెల్లడించింది. ఇవాళ, రేపు పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, గుంటూరు, బాపట్ల, అల్లూరి సీతారామరాజు, శ్రీకాకుళం, విజయనగరం, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, కడప జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీయనున్నాయి.
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://play.google.com/store/apps/details?id=com.indiadotcom.zeetelugu
Apple Link - https://apps.apple.com/in/app/zee-telugu-news/id1633190712
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook