KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీలోకి సోను సూద్, ప్రకాష్ రాజ్! పీకేకు ఉత్తరాది బాధ్యతలు.. ?

KCR NEW PARTY: జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈనెల 19న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత.. జాతీయ పార్టీపై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు

Written by - Srisailam | Last Updated : Jun 14, 2022, 05:21 PM IST
  • జాతీయ పార్టీ ఏర్పాట్లలో కేసీఆర్ బిజీ
  • కేసీఆర్ పార్టీలోకి సోను సూద్, ప్రకాష్ రాజ్
  • పీకేకు పార్టీ ఉత్తరాది బాధ్యతలు
KCR NEW PARTY: కేసీఆర్ జాతీయ పార్టీలోకి సోను సూద్, ప్రకాష్ రాజ్! పీకేకు ఉత్తరాది బాధ్యతలు.. ?

KCR NEW PARTY:  జాతీయ రాజకీయాలపై ఫోకస్ చేసిన తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్.. కొత్త పార్టీ ఏర్పాట్లను ముమ్మరం చేశారు. ఈనెల 19న జరగనున్న టీఆర్ఎస్ రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో నిర్ణయం తీసుకున్న తర్వాత.. జాతీయ పార్టీపై కేసీఆర్ అధికారిక ప్రకటన చేయనున్నారు. ఆ తర్వాత ఢిల్లీ వేదికగానే కేసీఆర్ పార్టీ బలోపతంపై ఫోకస్ చేయనున్నారు. జాతీయ రాజకీయలపై సంపూర్ణ అవగాహనతో ఉన్న గులాబీ బాస్.. తనతో కలిసివచ్చే నేతలు, శక్తులను కూడగడుతున్నారని తెలుస్తోంది. అందులో భాగంగానే కొందరు సెలబ్రిటీలతోనూ మాట్లాడుతున్నారని.. కేసీఆర్ తో కలిసి పనిచేసేందుకు కొందరు ముందుకు వస్తున్నారని చెబుతున్నారు.

విలక్షణ నటుడిగా పేరున్న ప్రకాష్ రాజ్ ఇప్పటికే కేసీఆర్ తో సన్నిహితంగా ఉంటున్నారు. జాతీయ పర్యటనల్లో భాగంగా కేసీఆర్ తో పలు రాష్ట్రాలకు వెళ్లారు ప్రకాష్ రాజ్. బెంగళూరు, చెన్నై, ముంబై వెళ్లినప్పుడు కేసీఆర్ తో ఉన్నారు. దీంతో కేసీఆర్ జాతీయ పార్టీలో ఆయనకు కీ రోల్ ఉండబోతుందని తెలుస్తోంది. ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి ప్రకాష్ రాజ్ పేరు వినిపించింది. కాని అతనికి ఇవ్వలేదు. అయితే జాతీయ పార్టీలో దక్షిణాది బాధ్యతలను ప్రకాష్ రాజ్ కు కేసీఆర్ అప్పగిస్తారని చెబుతున్నారు. గత లోక్ సభ ఎన్నికల్లో కర్ణాటక నుంచి పోటీ చేసి ఓడిపోయారు ప్రకాష్ రాజ్. మొదటి నుంచి బీజేపీని ఆయన వ్యతిరేకిస్తున్నారు. ప్రధాని నరేంద్రమోడీపైనా బహిరంగంగానే విమర్శలు చేశారు. ప్రకాష్ రాజ్ ను బీజేపీ నేతలు టార్గెట్ చేశారు. దీంతో బీజేపీకి వ్యతిరేకంగానే పార్టీ పెట్టనున్న కేసీఆర్.. ప్రకాష్ రాజ్ కు కీలక పాత్ర అప్పగించనున్నారని సమాచారం.

బాలీవుడ్ హీరో సోనుసూద్ కూడా కేసీఆర్ పార్టీలో చేరబోతున్నారని టీఆర్ఎస్ వర్గాలు చెబుతున్నాయి. కేసీఆర్ పాలనపై మొదటి నుంచి మంచి అభిప్రాయంతో ఉన్నారు సోనుసూద్. పలుసార్లు ఓపెన్ గానే కొనియాడారు. మంత్రి కేటీఆర్ తో సూద్ కు మంచి సంబంధాలు ఉన్నాయి. ట్విట్టర్ వేదికగా ఇద్దరి మధ్య చాలా అంశాల్లో చర్చలు సాగుతుంటాయి. సోనుసూద్ కు దేశ వ్యాప్తంగా మంచి ఫాలోయింగ్ ఉంది. కొవిడ్ సమయంలో ఆయన చేసిన సేవలకు దేశమంతా ఫిదా అయింది. అలాంటి వ్యక్తి మద్దతు ఉంటే తమకు లాభిస్తుందని కేసీఆర్ భావిస్తున్నారని తెలుస్తోంది. ఈ నేపథ్యంలోనే సోనుసూద్ తో టీఆర్ఎస్ నేతలు టచ్ లో ఉన్నారని అంటున్నారు. కేసీఆర్ పార్టీ విషయంలో సోను సూద్ కూడా ఆసక్తిగా ఉన్నారని చెబుతున్నారు.

కేసీఆర్ పార్టీకి కర్త,కర్మ, క్రియగా భావిస్తున్న ప్రశాంత్ కిషోర్ పార్టీలోనే కీలక బాధ్యతలు చేపట్టనున్నారని తెలుస్తోంది. బీఆర్ఎస్ పార్టీ సెక్రటరీ జనరల్ గా ప్రశాంత్ కిషోర్ ను నియమిస్తారనే ప్రచారం సాగుతోంది. గతంలో జేడీయూ పార్టీ ఉపాధ్యక్షుడిగా పని చేసిన అనుభనం పీకేకు ఉంది. ప్రశాంత్ కిషోర్ కు పార్టీ ఉత్తరాది బాధ్యతలు ఇవ్వాలనే యోచనలో కేసీఆర్ ఉన్నారని అంటున్నారు. జాతీయ రైతు సంఘం నేత రాకేష్ టికాయత్ కూడా కేసీఆర్ పార్టీకి మద్దతు ఇచ్చే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఇక జాతీయ పార్టీని ప్రకటించాక తొలి సభను ఢిల్లీలో భారీ ఎత్తున నిర్వహించడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని తెలుస్తోంది. కొత్త పార్టీ విధి విధానాలను కేసీఆర్ ఫైనల్ చేశారని అంటున్నారు. కేంద్ర ఎన్నికల సంఘం వద్ద కొత్త పార్టీని రిజిస్ట్రేషన్‌ చేసే ప్రక్రియకు ఏర్పాట్లు చేశారని తెలుస్తోంది. ఇందుకు సంబంధించి గత మూడు రోజులుగా ప్రగతి భవన్ లో కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ కసరత్తు చేస్తున్నారని తెలుస్తోంది.

Read Also: Revanth Reddy: పోలీసులపై యువకుల వీరంగం.. కేసీఆర్ పాలన ఇదేనంటూ రేవంత్ రెడ్డి ట్వీట్

Read Also: CM KCR: కేసీఆర్ షాకింగ్ న్యూస్... మమత మీటింగ్ కు డుమ్మా! 

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి

Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి TwitterFacebook 

 

Trending News