Son Hides Mother Deadbody: తల్లి శవం దహన సంస్కారాలకు డబ్బులు లేవని ఇంట్లోనే..

Son Hides Mother Deadbody: ప్రభుత్వ ఉపాధ్యాయురాలిగా జీవితాంతం చమటోడ్చి కష్టపడి సంపాదించింది ఆ తల్లి. కాని ఆమె కొడుకు మాత్రం తల్లి శవం అంతిమ సంస్కారాలకు కూడా డబ్బులు లేవని ఏం చేశాడో తెలిస్తే షాక్ అవడం మీ వంతు అవుతుంది.

Written by - Pavan | Last Updated : Dec 14, 2022, 09:39 PM IST
  • తల్లి చనిపోయి ఐదు రోజులైనా పట్టించుకోని కుమారుడు
  • మద్యం మత్తులో తల్లి శవంతో కొడుకు
  • సభ్య సమాజాన్ని షాక్‌కి గురయ్యేలా చేసే ఘటన
Son Hides Mother Deadbody: తల్లి శవం దహన సంస్కారాలకు డబ్బులు లేవని ఇంట్లోనే..

Son Hides Mother Deadbody in House: మంగళవారం ఒక ఇంట్లోంచి కుళ్లిన వాసన వస్తోందంటూ ఆ ఇంటికి ఇరుగుపొరుగు వారు, స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు హుటాహటిన ఘటనాస్థలానికి చేరుకుని ఆ ఇంట్లోకి వెళ్లి చూసి ఒక్కసారిగా షాకయ్యారు. ఒక వ్యక్తి తన తల్లి శవంతో పాటే ఆ ఇంట్లో ఉంటున్నాడు. ఏంటా అని ఆరా తీస్తే అతడు చెప్పిన సమాధానం ఏంటో తెలుసా ? " తన తల్లి శవం దహన సంస్కారాలకు డబ్బులు లేవని.. అందుకే శవానికి అంతిమ సంస్కారాలు చేయకుండా ఇంట్లోనే దాచి పెట్టాను '' అని చెప్పాడు. చనిపోయిన వృద్ధురాలి పేరు శాంతి దేవి. ఆమె వయస్సు 82 ఏళ్లు. ఉత్తర్ ప్రదేశ్ సర్కారు టీచర్‌గా పని చేసి రిటైర్ అయ్యారు. 

ఉత్తర్ ప్రదేశ్‌లోని గోరఖ్‌పూర్ జిల్లా షాబాజ్‌గంజ్‌లో చోటుచేసుకున్న ఈ ఉదంతం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. మద్యం మత్తులో పడిన ఒక వ్యక్తి.. తన తల్లి శవాన్ని ఎలా నిర్లక్ష్యం చేశాడో చెప్పే ఘటన ఇది. శాంతి దేవి శవం కుళ్లిన తీరు చూస్తే.. ఆమె చనిపోయి నాలుగైదు రోజులు అయ్యుంటుందని పోలీసులు ఒక అంచనాకు వచ్చారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన అడిషనల్ ఎస్పీ మనోజ్ కుమార్ అవస్తీ మీడియాతో మాట్లాడుతూ.. " శాంతి దేవి కుమారుడు నిఖిల్ మిశ్రా అలియాస్ డబ్బు మద్యానికి బానిసయ్యాడని.. అతడి మానసిక పరిస్థితి ఏమీ బాగోలేదు '' అని అన్నారు. 

శాంతి దేవి ఎలా చనిపోయింది, ఆమె చనిపోవడానికి ముందు, ఆ తరువాత ఇంట్లో ఏం జరిగిందో చెప్పే పరిస్థితిలో నిఖిల్ మిశ్రా లేడు అని అడిషనల్ ఎస్పీ మనోజ్ కుమార్ అవస్తీ తెలిపారు. ఐదు రోజుల క్రితమే తన తల్లి చనిపోయిందని.. డబ్బులు లేకపోవడం వల్లే ఆమె శవానికి అంతిమ సంస్కారాలు చేయకుండా ఇంట్లోనే దాచి పెట్టానని మాత్రమే చెప్పగలిగాడు అని అన్నారు. శాంతి దేవి మృతదేహాన్ని పోస్టుమార్టంకు పంపించామని.. పోస్ట్ మార్టం నివేదిక వస్తే కానీ ఒక నిర్ణయానికి రాలేమని పేర్కొన్నారు. 

నిఖిల్ మిశ్రాకు భార్య, ఒక కుమారుడు ఉన్నారు. అయితే, అతడు నిత్యం తాగి వచ్చి గొడవ పడుతుండటంతో 15 రోజుల క్రితమే ఆమె తన కొడుకును తీసుకుని తల్లిగారింటికి వెళ్లింది. దీంతో ఇంట్లో శాంతి దేవి, నిఖిల్ మిశ్రా.. ఇద్దరే ఉండటం.. నిఖిల్ మానసిక పరిస్థితి సరిగ్గా లేకపోవడంతో ఆమె చనిపోయిన విషయం బయటికి రాలేదు. నిఖిల్ మిశ్రా ఇంట్లోనే ఒక కుటుంబం అద్దెకు ఉండేది. కానీ అతడి ప్రవర్తన నచ్చకపోవడంతో వారు కూడా ఒక నెల రోజుల క్రితమే ఇల్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. అలా ఆ ఇంట్లో నిఖిల్ ఒక్కడే తల్లి శవంతో 5 రోజులు గడిపాడు. 

ఇది కూడా చదవండి : Man ate woman: యువతిని రేప్ చేసి, చంపి, మాంసం తిని, శిక్ష లేకుండా తప్పించుకున్నాడు.. కానీ

ఇది కూడా చదవండి : Woman's Revenge Story: మరొకరిని చంపి అదే శవంతో సూసైడ్ స్కెచ్.. సినిమాను తలపించే రివేంజ్ డ్రామా

ఇది కూడా చదవండి : Husband Murder: భర్తను చంపి, ముక్కలు చేసి.. ఒక్క పొరపాటు ఇద్దరినీ పట్టించింది

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee తెలుగు న్యూస్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.  

ఆండ్రాయిడ్ లింక్ -  https://bit.ly/3P3R74U 

ఆపిల్ లింక్ -  https://apple.co/3loQYe 

మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండిTwitter , Facebook

Trending News