Covavax: పుణేకు చెందిన సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా (ఎస్ఐఐ) నుంచి మరో కొవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి (New corona vaccine) రానుంది. ఈ వ్యాక్సిన్ అత్యవస వినియోగానికి వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ (డబ్ల్యూహెచ్ఓ) ఆమోదముద్ర వేసింది.
అమెరికాకు చెందిన నోవావాక్స్ భాగస్వామ్యంతో సీరమ్ ఈ వ్యాక్సిన్‌ను అభివృద్ధి చేస్తోంది. దీనికి కోవావాక్స్ (COVOVAX) అని పేరు పెట్టారు.
అల్పాదాయ దేశాల్లో టీకా లభ్యత పెంచేందుకు గాను ఈ వ్యాక్సిన్‌కు డబ్ల్యూహెచ్ఓ (WHO Gives nod to Covovax) అనుమతి మంజూరు చేసింది. అత్యవసర వినియోగం కోసం డబ్ల్యూహెచ్ఓ అనుమతించిన 9వ వ్యాక్సిన్ ఇది. దీనితో ఈ వ్యాక్సిన్ త్వరలోనే వినియోగంలోకి రానుంది. భారత్‌లో ప్రస్తుతం కొవాగ్గిజన్, కొవిషీల్డ్, స్పుత్నిక్ వ్యాక్సిన్లు వినియోగంలో ఉన్నాయి. ఇందులోన కొవిషీల్డ్‌ను కూడా సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియానే అభివృద్ధి చేస్తుండటం గమనార్హం.
కోవావాక్స్ గురించి..
ఈ ఏడాది తొలినాళ్లలోనే ఈ వ్యాక్సిన్ తుది దశ ప్రయోగాలు నిర్వహించింది నోవావాక్స్. ఇందులో ఈ వ్యాక్సిన్ కొవిడ్ 19పై 96.4 శాతం ప్రభావవంతగా పని చేసినట్లు తేలింది. ఒక్క డోసు ద్వారానే 83.4 శాతం ప్రభావశీలత కనిపించినట్లు అప్పట్లో వెల్లడించింది నోవావాక్స్.
అదర్ పునావాలా..
కోవావాక్స్ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్ఓ (Covovax gets WHO nod) అనుమతించిన నేపఫథ్యంలో సీరమ్ సీఈఓ అదర్ పునావాలా హర్షం వ్యక్తం చేశారు. కొవిడ్‌పై పోరాటంలో ఇది మరో మైలురాయి అని అభిప్రాయపడ్డారు. ఈ వ్యాక్సిన్ అద్భుతంగా పని చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
This is yet another milestone in our fight against COVID-19, Covovax is now W.H.O. approved for emergency use, showing excellent safety and efficacy. Thank you all for a great collaboration, @Novavax @WHO @GaviSeth @Gavi @gatesfoundation https://t.co/7C8RVZa3Y4
— Adar Poonawalla (@adarpoonawalla) December 17, 2021
Also read: Omicron Cases: భారత్‌లో ఒమిక్రాన్ విజృంభన, 109 కి చేరిన కేసులు..జాగ్రత్త అంటోన్న కేంద్రం
Also read: Omicron : ఒమిక్రాన్ వల్ల దేశంలో మళ్లీ లాక్‌డౌన్? న్యూ ఇయర్ వేడుకలు లేనట్లేనా!
స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. క్రీడలు, వినోదం, రాజకీయాలు, విద్య, ఉద్యోగాలు, హెల్త్, లైఫ్‌స్టైల్ .. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G
Apple Link - https://apple.co/3loQYe
మా సోషల్ మీడియా పేజీలు సబ్‌స్క్రైబ్ చేసేందుకు క్లిక్ చేయండి Twitter , Facebook