Sensex: భారత స్టాక్ మార్కెట్లకు కరోనా దెబ్బ

'కరోనా వైరస్' ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO.. 'కరోనా వైరస్'ను మహమ్మారిగా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు విపరీతంగా ప్రభావితమయ్యాయి. 

Last Updated : Mar 13, 2020, 08:54 AM IST
Sensex:  భారత స్టాక్ మార్కెట్లకు కరోనా దెబ్బ

'కరోనా వైరస్' ప్రభావం భారత స్టాక్ మార్కెట్లపై పడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ..WHO.. 'కరోనా వైరస్'ను మహమ్మారిగా ప్రకటించడంతో ప్రపంచవ్యాప్తంగా ఈక్విటీ మార్కెట్లు విపరీతంగా ప్రభావితమయ్యాయి. అన్ని దేశాల్లో స్టాక్ మార్కెట్లు 'బేర్ మార్కెట్' స్థితిలోకి  వెళ్లిపోయాయి. అలాగే భారత స్టాక్ మార్కెట్లు కూడా బేర్ మార్కెట్ లోకి వెళ్లాయి.  

బాంబే స్టాక్ ఎక్చేంజీ..BSE ఇవాళ ఉదయం నుంచే భారీ నష్టాల్లో ట్రేడ్ అయింది.  ఇవాళ సాయంత్రం మార్కెట్ ముగిసే సమయానికి మొత్తంగా  2 వేల 919 పాయింట్లు కోల్పోయింది. అలాగే జాతీయ స్టాక్ ఎక్చేంజీ... నిఫ్టీ కూడా 868 పాయింట్లు కోల్పోయి.. 9 వేల590 పాయింట్ల వద్ద స్థిరపడింది. ఒకే రోజులో ఇంత భారీగా పడిపోవడం దాదాపు 33 నెలల తర్వాత ఇదే తొలిసారి కావడం విశేషం. దీంతో ఇన్వెస్టర్ల సంపద 11 లక్షల కోట్లు ఆవిరైపోయింది. మొత్తంగా ఈ రోజు భారత స్టాక్ మార్కెట్లు 9 శాతం పతనం చెందాయి. 

Read Also: ఇటలీలో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులు

బీఎస్ఈ సెన్సెక్స్, నిఫ్టీ 50లో అన్ని ఈక్విటీలు నష్టాలనే చవి చూశాయి. అందులో ముఖ్యంగా BPCL, UPL, YES BANK, VEDANTA, GAIL షేర్లు భారీ నష్టాలు మూటగట్టుకున్నాయి. ప్రభుత్వ రంగ కంపెనీల్లో 12 శాతం, ఇంధన కంపెనీల్లో 9.4 శాతం, మెటల్, ఐటీ, ఫార్మా షేర్లలో 8 శాతం నష్టాలు కనిపించాయి.జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. Read Also: సీఎం కుర్చీపై రజినీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు

Trending News