విద్వేష సందేశాలు పంపితే మూడేళ్ళ జైలు: ఢిల్లీ ప్రభుత్వం

వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేషపూరిత సందేశాలు, నకిలీ వార్తలు పోస్ట్ చేసినా, క్రియేట్ చేసినా 3సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని,ఢిల్లీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ తెలిపింది. గత వారం ఈశాన్య ఢిల్లీలోని

Last Updated : Mar 2, 2020, 11:51 PM IST
విద్వేష సందేశాలు పంపితే మూడేళ్ళ జైలు: ఢిల్లీ ప్రభుత్వం

న్యూఢిల్లీ: వాట్సాప్, ఇతర సోషల్ మీడియా వేదికల ద్వారా విద్వేషపూరిత సందేశాలు, నకిలీ వార్తలు పోస్ట్ చేసినా, క్రియేట్ చేసినా 3సంవత్సరాల జైలు శిక్ష పడుతుందని,ఢిల్లీ అసెంబ్లీలో ఏర్పాటు చేసిన పీస్ కమిటీ తెలిపింది. గత వారం ఈశాన్య ఢిల్లీలోని కొన్ని ప్రాంతాల్లో జరిగిన హింసాకాండ నేపథ్యంలో రెచ్చగొట్టే సందేశాలు నకిలీ వార్తలు ప్రసారమైన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుందని తెలిపారు.  

 

పీస్ ప్యానెల్ ఏర్పడిన కొన్ని గంటల తరువాత, ఆప్ ఎమ్మెల్యే, కమిటీ చైర్మన్ సౌరభ్ భరద్వాజ్ మాట్లాడుతూ, ఎవరైనా రెచ్చగొట్టే సందేశాన్ని పంపిన చాట్ గ్రూపులో ఉంటే, దాని గురించి ఫిర్యాదు చేయడం ద్వారా మీరు విజిల్బ్లోయర్ కావచ్చని తెలిపింది. అటువంటి వ్యక్తులు తమ ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేస్తే 10,000 రూపాయల రివార్డ్ పొందుతారని భరద్వాజ్ పేర్కొన్నారు. 

ఇలాంటి ఫిర్యాదులను పరిశీలించిన తరువాత, ప్యానెల్ వాటిని క్రిమినల్ ప్రాసిక్యూషన్ కోసం పోలీసులకు పంపుతుందని గ్రేటర్ కైలాష్ ఎమ్మెల్యే తెలిపారు. కమిటీ తన న్యాయ నిపుణుల బృందం ద్వారా ఫిర్యాదులను క్రాస్ చెక్ చేస్తుందని, ఈ కంటెంట్ రెండు వర్గాలు, సమూహాల మధ్య ద్వేషం, భంగం, శత్రుత్వాన్ని ప్రేరేపిస్తుందని భావిస్తే క్రిమినల్ ప్రాసిక్యూషన్లను సిఫారసు చేస్తామని కమిటీ పేర్కొంది.  జీ హిందుస్తాన్ తెలుగు టీవీ లైవ్ లింక్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. Watch Zee Hindustan Telugu live here.. 

Trending News