Online classes: ఆన్‌లైన్ క్లాసెస్ కోసం బాలుడు smartphone చోరీ.. పోలీసులు ఏం చేశారంటే..

స్మార్ట్ ఫోన్ లభిస్తే ఆన్‌లైన్ క్లాసెస్ ( Smartphone for online classes ) వినొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ బాలుడు సైతం ఆ ఇద్దరు క్రిమినల్స్‌కి సహకరించడానికి అంగీకరించి వారితో చేతులు కలిపాడు.

Last Updated : Sep 21, 2020, 06:11 PM IST
  • ఆన్‌లైన్ తరగతులు హాజరవడం కోసం స్మార్ట్ ఫోన్ లేదని చోరీల బాట పట్టిన బాలుడు
  • స్మార్ట్ ఫోన్ చోరీ కేసులో పట్టుబటిన బాలుడికి పోలీసుల కౌన్సిలింగ్
  • బాలుడు ఆన్‌లైన్ క్లాసెస్ హాజరవడానికి వీలుగా సాయపడిన పోలీసు ఆఫీసర్
Online classes: ఆన్‌లైన్ క్లాసెస్ కోసం బాలుడు smartphone చోరీ.. పోలీసులు ఏం చేశారంటే..

Student caught snatching smartphone for online classes చెన్నై: ఆన్‌లైన్ క్లాసెస్‌కి హాజరవడానికి స్మార్ట్‌ఫోన్ లేని ఓ విద్యార్థి క్లాసెస్ జరుగుతున్న సమయంలో గాలి తిరుగుడు తిరగడాన్ని గమనించిన ఇద్దరు క్రిమినల్స్.. అతడికి స్మార్ట్ ఫోన్ ఆశ చూపించి తమ గ్యాంగ్‌లో కలిపేసుకున్నారు. తమ బ్యాచ్‌లో ఓ బాలుడు కూడా ఉంటే ఎవ్వరికీ తమపై అనుమానం రాకపోగా.. ఒకవేళ పట్టుబడితే బాలుడిని చూసి అయినా వదిలేస్తారని ఆ ఇద్దరు క్రిమినల్స్ స్కెచ్ వేశారు. స్మార్ట్ ఫోన్‌తో ఆన్‌లైన్ క్లాసెస్ ( Smartphone for online classes ) వినొచ్చు కదా అనే ఉద్దేశంతో ఆ బాలుడు సైతం ఆ ఇద్దరు క్రిమినల్స్‌కి సహకరించడానికి అంగీకరించి వారితో చేతులు కలిపాడు. Also read : Kids Using Smartphones: మీ పిల్లలు స్మార్ట్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారా? ఇలా చేయండి!

అలా ఓ స్మార్ట్ ఫోన్ చోరీ కేసులో ( Smart phone theft case ) పట్టుబడిన బాలుడి ధీనావస్త గురించి తెలుసుకున్న ఓ పోలీస్ ఆఫీసర్.. ఆ బాలుడు స్మార్ట్ ఫోన్ కోసం అడ్డదారులు తొక్కకుండా అతడికి తన సొంత డబ్బులతో ఓ స్మార్ట్ ఫోన్ కొని బహుమతిగా ఇచ్చిన ఘటన ఇది.
 
చెన్నైలో చోటుచేసుకున్న ఈ ఘటనలో 13 ఏళ్ల విద్యార్థి భవిష్యత్తులో చోరీల బాటపట్టకుండా కాపాడిన పోలీస్ ఆఫీసర్‌పై సర్వత్రా ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. చెన్నైలోని ఓ కార్పొరేషన్ స్కూల్లో చదువుతున్న విద్యార్థిని పేదరికం ఆన్‌లైన్ తరగతులకు ( Online classes ) దూరం చేసింది. తండ్రి ఓ బిస్కట్ దుకాణంలో పని చేస్తుండగా తల్లి ఇళ్లలో పాచిపని చేసుకుంటోంది. తమ కుమారుడికి స్మార్ట్ ఫోన్ కొనిచ్చేంత ఆర్థిక స్థోమత ఈ దంపతులకు లేకపోయింది. ఇదే అవకాశంగా భావించిన ఇద్దరు క్రిమినల్స్ ఆ బాలుడికి మాయమాటలు చెప్పి తమ దొంగల బ్యాచ్‌లో కలిపేసుకున్నారు. కానీ అదృష్టవశాత్తుగా ఆ బాలుడి ఇబ్బందుల గురించి తెలుసుకున్న పోలీస్ ఆఫీసర్.. క్రిమినల్స్‌కి బుద్ధి చెప్పి బాలుడిని ఆ ముఠా బారి నుంచి రక్షించారు. Also read : 
జేఈఈ అడ్వాన్స్‌డ్ హాల్ టికెట్ డౌన్‌లోడ్ చేసుకోండి

స్థానికం నుంచి అంతర్జాతీయం వరకు.. విద్య, వినోదం, రాజకీయాలు, క్రీడలు, హెల్త్, లైఫ్‌స్టైల్, సామాజికం, ఉపాధి.. A to Z అన్నిరకాల వార్తలను తెలుగులో పొందడం కోసం ఇప్పుడే Zee హిందుస్థాన్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.
Android Link - https://bit.ly/3hDyh4G

Apple Link - https://apple.co/3loQYe

Trending News